Standup Comedy : స్టాండప్ కామెడీ కాంటెస్ట్.. క్యాష్ ప్రైజ్‌తో పాటు.. కామెడీ సిరీస్‌లలో నటించే అవకాశం

తాజాగా ఈ సంవత్సరం స్టాండప్ కామెడీ కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్టాండప్ కామెడీ కాంటెస్ట్ లో 12 ఏళ్ళకు పైబడినవారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఏదైనా టాపిక్ మీద తెలుగులో మినిమమ్........

Standup Comedy : స్టాండప్ కామెడీ కాంటెస్ట్.. క్యాష్ ప్రైజ్‌తో పాటు.. కామెడీ సిరీస్‌లలో నటించే అవకాశం

Standup Comedy

Standup Comedy :   బ్రిహస్పతి టెక్నలాజిస్ అనే సంస్థ గతంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖతో కలిసి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించింది. తాజాగా ఈ సంవత్సరం స్టాండప్ కామెడీ కాంటెస్ట్ ని నిర్వహిస్తున్నారు. ఈ స్టాండప్ కామెడీ కాంటెస్ట్ లో 12 ఏళ్ళకు పైబడినవారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఏదైనా టాపిక్ మీద తెలుగులో మినిమమ్ 3 నిమిషాల నుండి మ్యాగ్జిమమ్ 5 నిముషాలు లోపు స్టాండప్ కామెడీ చేయాలి. క్యాస్ట్, మతపరమైన లాంటి సున్నిత అంశాలు మినహాయించి ఏదైనా టాపిక్ మీద చేయొచ్చు.

మీ ఫోన్ లేదా కెమెరాలో మీ స్టాండప్ కామెడీని వీడియో తీసి వారి వాట్సాప్ లేదా మెయిల్ కి పంపించాలి. ఒకరు లేదా ఇద్దరు కలిసి ఈ స్టాండప్ కామెడీని చేయొచ్చు. అయితే ఈ కాంటెస్ట్ కి ఎలాంటి జడ్జెస్ లేరు. ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు. మీరు పంపిన వీడియోలను ఒకే రోజు ఫన్నీ స్టార్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసి మీకు లింక్ పంపిస్తారు.

Priya Prakash Varrier : వారి వల్ల బయట చలిలో కూర్చొని తిన్నాను.. చాలా అమర్యాదగా ప్రవర్తించారు..

ఎక్కువ వ్యూస్ వచ్చిన వారిలో టాప్ 10లో నిలిచిన వారిని రవీంద్రభారతిలో సర్టిఫికెట్, మెమెంటోతో సత్కరిస్తారు. మార్చ్ 10వ తేదీన ఈ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు. గెలిచిన వారిలో టాప్ లో ఉన్న ముగ్గురికి క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వబడుతుంది. అంతే కాక టాప్ 10లో నిలిచిన వారికి కామెడీ వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం ఇవ్వబడును. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ సర్టిఫికెట్ పంపించబడును. వీడియోలు సబ్మిట్ చేయటానికి చివరి తేదీ ఫిబ్రవరి 15. మరిన్ని వివరాలకు 7337555205 నంబర్ కి సంప్రదించగలరు.