Star Directors: కోట్లలో రెమ్యునరేషన్.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న క్రేజీ డైరెక్టర్స్!

వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలంటే ఈ హీరోల పారితోషకం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక హీరోలను వెయ్యి క్లబ్ లో పడేసిన దర్శకులు కూడా ఆ హీరోలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

Star Directors: కోట్లలో రెమ్యునరేషన్.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తోన్న క్రేజీ డైరెక్టర్స్!

Star Directors

Star Directors: సౌత్ నుండి పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరగా బాలీవుడ్ నుండి అమిర్ ఖాన్ ఒక్కడే సింగిల్ పీస్ గా బాలీవుడ్ హీరో అమీర్ కనిపిస్తున్నాడు. నెక్స్ట్ మహేష్ లాంటి హీరోలు ఈ క్లబ్ లో చేరేందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలంటే ఈ హీరోల పారితోషకం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక హీరోలను వెయ్యి క్లబ్ లో పడేసిన దర్శకులు కూడా ఆ హీరోలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. రూటు మార్చి రేట్ పెంచి కాస్ట్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకుంటున్నారు. అవును సౌత్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిలబెడుతున్న ది గ్రేట్ డైరెక్టర్స్ తీసుకునే పారితోషకం హాట్ టాపిక్ గా మారుతోంది. లిటరల్ గా చుక్కలు చూపిస్తోంది.

Star Directors: ఒక్క ఫ్లాప్ పడితే డైరెక్టర్ల అడ్రస్ గల్లంతేనా..?

మేకింగ్ విషయంలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఖరీదైన కంటెంట్ తో ఫిదా చేస్తున్నారు. ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి విజిల్స్ వేయిస్తున్నారు. కనివినీ ఎరుగని రికార్డులకు సౌత్ డైరెక్టర్స్ కొందరు కేరాఫ్ అడ్రాస్ అవుతున్నారు. అంతేనా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాక.. అదే రేంజ్ లో హై రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వసూళ్లలో వాటాలు అడుగుతున్నారు.. వాళ్లు అడగకపోయినా మాతో సినిమా చేయండంటూ నిర్మాతలే కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటించేస్తున్నారు.

Star Directors: డైరెక్టర్ల మెడ మీద కత్తి.. ఫ్లాపైతే చేతగాని తనమేనా?

50 కోట్ల నిచ్చెనను ఎక్కేశాడు ప్రశాంత్ నీల్. ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ చేయడమే కాదు.. 1000 కోట్లను క్రాస్ చేసి పరుగులు పెట్టించడంలో ప్రశాంత్ నీల్ దే మేజర్ రోల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ మెగా సక్సెస్ తో నేషన్ వైడ్ రికగ్నైజ్ సాధించిన నీల్.. ప్రభాస్ హీరోగా ప్రస్తుతం సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌజ్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. అయితే ఈ మూవీకి దాదాపు 25 కోట్లు ప్రశాంత్ నీల్ కు ముట్టు జెప్తున్నారు నిర్మాతలు. అంతే కాదు లాభాల్లో వాటాను కూడా షేర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

సలార్ తర్వాత టాలీవుడ్ నిర్మాతలతో ఒప్పుకున్న రెండు సినిమాలకు మాత్రం ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ డబుల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మీదట 50 కోట్ల మీటర్ కే ఎస్ చెప్తానంటున్నాడు ఈ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాకు 50 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నట్టు టాక్. ఈమధ్యే దానికి సంబంధించిన అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ అందుకున్నాడు. తారక్ సినిమా తర్వాత డివివి దానయ్య బ్యానర్ లో చేసే సినిమాకు ఇదే రేంజ్ లో వసూలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా చరణ్ నటించే ఛాన్స్ ఉంది. అయితే రెమ్యునరేషన్ తో పాటూ ఈ సినిమాల ఫ్రాఫిట్ షేర్ కూడా మన తెలుగు నిర్మాతలు ఇస్తారా లేదా అన్నది తెలియాలి.

New Directors: లక్కీ చాన్స్.. పెద్ద బ్యానర్లను పట్టేస్తున్న కొత్త దర్శకులు!

ప్రశాంత్ నీల్ కన్నా ముందే దర్శకధీర రాజమౌళి రెమ్యునరేషన్ తో చుక్కలు చూపించాడు. తాను తీసే ప్రతి సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి లాంగ్ టైమ్ తీసుకుని కష్టపడటం జక్కన్నకు అలవాటు. ఆ కష్టానికి తగినట్లే.. రెమ్యునరేషన్‌ కూడా భారీగానే తీసుకుంటాడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు 80 కోట్లకు పైగానే రాజమౌళికి పారితోషికం అందించిందని సమాచారం. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ లాభాల్లో 30 శాతం వాటా కూడా అడిగినట్లు ఆమధ్య మాటలు వినిపించాయి. అయితే పెట్టిన పెట్టుబడికి తగినంత.. ముఖ్యంగా జక్కన్న ఎక్స్పెక్ట్ చేసినట్టు ట్రిపుల్ ఆర్ 2వేల మార్క్ చేరుకోలేదు కాబట్టి ఈ డైరెక్టర్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంది.

Young Directors: కేరాఫ్ సెన్సేషన్.. స్టార్ డైరెక్టర్లను చేసిన ఒక్క సినిమా!

పుష్ప పార్ట్ 1 వరకు 20 నుంచి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న సుకుమార్.. పుష్ప2 తో తగ్గేదేలే అంటున్నాడు. అవును పుష్ప పార్ట్ 2ను అంతకు మించి అన్నట్టు చూపించాలనుకుంటున్నాడు సుకుమార్. దానికి తగ్గట్టే 50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప ది రైజ్ తో ఊహించని సక్సెస్ ఇచ్చిన సుక్కూకు అడిగినంత ఇచ్చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా రెడీఅయినట్టు చెప్తున్నారు.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

భారీ బడ్జెట్, హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాలు చేసే రిచ్ దర్శకుడిగా పేరుది శంకర్ కి. గతంలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటాడనే పేరుంది ఈయనకి. ఇప్పుడు ఫ్లాప్స్ ఎదురొచ్చినా సరే.. రామ్ చరణ్ తో తీస్తోన్నసినిమాకు భారీగానే అందుకుంటున్నాడు. దాదాపు 40 కోట్ల రూపాయలను శంకర్ కు దిల్ రాజు ముట్ట జెప్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.