Star Hero Fans: ఫ్యాన్స్ సోషల్ అరాచకం.. పాపం మేకర్స్‌కు వణుకే..! Star Hero Fans social media issue.. makers are shaking ..!

Star Hero Fans: ఫ్యాన్స్ సోషల్ అరాచకం.. పాపం మేకర్స్‌కు వణుకే..!

అభిమానులందు టాలీవుడ్ స్టార్స్ అభిమానులు వేరు. అవును మన హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు మరి. వాళ్ల ఫేవరెట్ హీరోపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. సరైన టైమ్ కి అప్ డేట్..

Star Hero Fans: ఫ్యాన్స్ సోషల్ అరాచకం.. పాపం మేకర్స్‌కు వణుకే..!

Star Hero Fans: అభిమానులందు టాలీవుడ్ స్టార్స్ అభిమానులు వేరు. అవును మన హీరోల ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు మరి. వాళ్ల ఫేవరెట్ హీరోపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. సరైన టైమ్ కి అప్ డేట్ రాకపోతే మేకర్స్ పై అంతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఫామ్ లోకి వచ్చాక.. ఏ చిన్న రీజన్ దొరికినా.. ఇదీ మా హీరో అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. టాప్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Akhanda: బాలయ్య-బోయపాటి.. టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేస్తారా?

ఇదిగో.. ఇంతటి పీక్ స్టేజ్ లో ఉంది ఫ్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. డార్లింగ్ రెబల్ స్టార్.. గ్లోబల్ స్టార్ అవతారమెత్తాక అది నేషనల్ వైడ్ స్పైడయింది. వాళ్లకి ప్రభాస్ ఎంత చెప్తే అంత. డార్లింగ్ చెప్పినట్టు సంతోశ్ శోభన్ సినిమా చూస్తారు.. ఆకాశ్ సినిమాకి వెళ్లొస్తారు. అలాంటిది ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ప్రభాస్ సినిమా అప్ డేట్ రాకపోతే ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసారు. ఓవైపు పుష్ప, ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ మాంచి ట్రాక్స్ మీదుంటే.. మా హీరో సినిమాను సైలెంట్ లో పెడతారా అంటూ మేకర్స్ మీద ట్రోల్స్ చేసారు. మీమ్స్ వదిలారు.

Hansika Motwani: యాపిల్ బ్యూటీ హన్సిక గ్లామర్ ట్రీట్!

ఓ అడుగు ముందుకేసి ఒకరైతే సూసైడ్ నోట్ కూడా యూవీ క్రియేషన్స్ కి సెండ్ చేసాడు. ఇంకేముంది ఇదిగో సింగిల్ అంటూ ప్రకటించేసారు రాధేశ్యామ్ దర్శకనిర్మాతలు. మహేశ్ ఫ్యాన్స్ అరాచకం కూడా మామూలుగా లేదు. సోషల్ మీడియాలో నంబర్ వన్ గా సూపర్ స్టార్ ను నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త స్టంట్స్ వేస్తూనేఉంటారు. వాళ్ల పనిని పక్కకుబెట్టి మరీ మహేశ్ స్టేటస్ పై ఫోకస్ చేస్తుంటారు. సర్కారు వారి పాట గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ సాధించిందంటే కారణం అభిమానులే కదా. అందుకే మహేశ్ కూడా తన ఫ్యాన్స్ కు బాగానే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ల టేస్ట్ కు తగ్గట్టే సినిమాలను చేసేందుకు ఇష్టపడుతారు.

Kamal Hasan: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!

మెగా అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఆ ఫ్యామిలీ నుంచి ఏ గుడ్ అప్ డేట్ వచ్చినా వీళ్లింట్లో పండుగ చేసుకుంటారు. మెగా పిలుపు ఏదైనా రాగానే ముందుండి నడిపిస్తారు. చిరూ ఫుల్ ఫాంలోకి వచ్చి వరుసగా సినిమాలు చేస్తుంటే…సోషల్ మీడియాలో కేక పెట్టిస్తున్న ఫ్యాన్స్…ఇటు చరణ్ ట్రిపుల్ ఆర్ న్యూస్ ను హై స్పీడ్ లో పాపులర్ చేస్తున్నారు. బన్నీకి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారన్నా.. పుష్ప సింగిల్స్ ట్రెమండస్ హిట్ కొట్టాయన్నా రీజన్ ఫ్యాన్సే కదా.

Ram Charan: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!

ఇక పవర్ స్టార్ అభిమానులైతే భీమ్లా నాయక్ కోసం తక్కవ కష్టపడట్లేదు. 24 గంటల్లోనే భీమ్లానాయక్ సింగిల్స్ రికార్డ్ సృష్టిస్తున్నాయంటే ఏ రేంజ్ లో పవర్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ అభిమానుల స్టైలే వేరు. దెబ్బ కొట్టినా… ముద్ద పెట్టినా మా బాలయ్యే అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్లు. ఇన్నాళ్లు బయటికి రాని కొన్ని బాలయ్య ఫ్యాన్ మూమెంట్స్… ఆహా అన్ స్టాపబుల్ తో రివీల్ అవుతుండటంతో క్రేజీగా ఫీలవుతున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ అఖండ సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Pooja Hegde: మాల్దీవుల్లో అందాల మంట పెట్టిన పూజా హెగ్డే.. బాప్ రే బికినీ షో..!

అటు ఎన్టీఆర్ కి తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. డాన్స్, యాక్టింగ్, సింగింగ్ ఏదైనా టాప్ మా తారకే అని గట్టిగా చెప్పగలరు ఆయన అభిమానులు. అందుకే ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంతా చేస్తున్నారు. రౌడీ బాయ్ ఫ్యాన్స్ కైతే విజయ్ ను తలచుకోగానే పూనకాలొచ్చేస్తాయి. సో ఫ్రెండ్లీగా ఫ్యాన్స్ తో మాట్లాడే దేవరకొండ కోసం వాళ్లూ బాగానే కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో రౌడీబాయ్ ట్రెండింగ్ లో ఉంటాడంటే ఆయన ఫ్యాన్స్ చేసే హ్యాష్ ట్యాగ్ ల చలువే.

Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

ఇక అయ్యగారు అఖిల్ ది వేరే లెవెల్. అఖిల్ కు గట్టి హిట్టు పడాలని ఆయనకంటే ఎక్కువ కోరుకున్నారు ఫ్యాన్స్. హిట్ సాధించాక ఫుల్ స్వింగ్ లో సంబరాలు చేసుకున్నారు. ఇక మా అయ్యగారు అఖిల్ నంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఫ్యాన్ కే…సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేటైందంటే సోషల్ అరాచకం మామూలుగా లేదు.

×