Vijay : రోజు రోజుకి తండ్రికి దూరం అవుతున్న స్టార్ హీరో

విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే ఆయన తండ్రి విజయ్ పేరు వాడుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది విజయ్ కి నచ్చలేదు.

Vijay : రోజు రోజుకి తండ్రికి దూరం అవుతున్న స్టార్ హీరో

Vijay

Vijay :  తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ రోజు రోజుకి తన తండ్రికి దూరం అవుతున్నారు. కొద్ది రోజుల నుండి విజయ్ ఆయన తండ్రి చంద్రశేఖర్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇటు విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే ఆయన తండ్రి విజయ్ పేరు వాడుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది విజయ్ కి నచ్చలేదు.

విజయ్ తండ్రి 2020లో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు చేస్తుండటంతో మొదట్లో మాములుగా చెప్పి చూసాడు విజయ్. అయినా వినకపోవడంతో కొద్ది రోజుల క్రితం విజయ్ ఆయన తండ్రిపై మరియు అతనికి సహకరించే పదకొండు మందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఈ విషయం తమిళనాడులోనే కాక తమిళనాడు బయట కూడా సంచలనంగా మారింది. అంతే కాక అదే పేరుతో రాజకీయ పార్టీ కూడా పెట్టబోతున్నట్టు ఊహాగానాలు వచ్చేలా చేశారు విజయ్ తండ్రి. దీంతో విజయ్ తన తండ్రి మీద సీరియస్ అయ్యారు.

Puri Jagannadh : ఎవడు సినిమా తీస్తే డైలాగ్స్ జనాల్లోకి వెళ్ళిపోతాయో వాడే ‘పూరి’ గాడు.. బర్త్ డే స్పెషల్ స్టోరీ

అంతే కాకుండా విజయ్‌ ఇటీవల చెన్నై హక్కుల కోర్టులో తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో తండ్రి కొడుకుల మధ్య దూరం బాగా పెరిగింది. ఈ వివాదం ఎటు వెళ్తుందో అని అభిమానులు కూడా ఆలోచించారు. కానీ తాజాగా దళపతి విజయ్‌కు ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ షాక్‌ ఇచ్చారు. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముగిసిందా లేక ఇంకా పెరిగిందా అని విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు అర్ధం కాకుండా ఉన్నారు.