Star Heroins: వరస ప్లాప్స్.. జాగ్రత్త పడకపోతే స్టార్ డమ్ గల్లంతే! Star Heroins faced flops.. If they are not careful, stardom is gone!

Star Heroins: వరస ప్లాప్స్.. జాగ్రత్త పడకపోతే స్టార్ డమ్ గల్లంతే!

సౌత్ స్టార్ హీరోయిన్స్ కు కాలం కలిసిరావట్లేదు. క్రేజీ అండ్ సీనియర్ హీరోయిన్స్ అని చెప్పుకునే భామలందరి లేటెస్ట్ సినిమాలు ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోతున్నాయి. అయినా సరే మాకే సంబంధం లేదన్నట్టు ఎవరి వర్క్ లో వాళ్లు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.

Star Heroins: వరస ప్లాప్స్.. జాగ్రత్త పడకపోతే స్టార్ డమ్ గల్లంతే!

Star Heroins: సౌత్ స్టార్ హీరోయిన్స్ కు కాలం కలిసిరావట్లేదు. క్రేజీ అండ్ సీనియర్ హీరోయిన్స్ అని చెప్పుకునే భామలందరి లేటెస్ట్ సినిమాలు ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోతున్నాయి. అయినా సరే మాకే సంబంధం లేదన్నట్టు ఎవరి వర్క్ లో వాళ్లు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జోష్ చూపిస్తున్నారు. సౌత్ క్వీన్స్ వరుసగా ఫ్లాప్ సినిమాల్ని వాళ్ల అకౌంట్ లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్స్ గా చలామణీ అవుతోన్న ముద్దుగుమ్మల లాస్ట్ రిలీజ్ లను చూస్తే ఫట్ మన్నవే కనిపిస్తున్నాయి. అయితే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సూపర్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ కలరింగ్ ఇస్తున్నారు.

Star Heroins: పర్సనల్ స్టైలిస్ట్ ఫీవర్.. స్టార్ హీరోయిన్ల అందం వెనుకున్నది వాళ్ళే!

లవర్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో నటించిన కాదు వాక్కుల రెండు కాదల్ సినిమాతో నయనతార రీసెంట్ గా ఫ్లాప్ కొట్టింది. కానీ ఈమె చేతిలో చిరూ గాడ్ ఫాదర్, షారుఖ్ ఖాన్ లయన్, రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలున్నాయి. అజిత్, విఘ్నేశ్ శివన్ కాంబో మూవీలో కూడా అవకాశం నయన్ నే వరించేలా ఉంది. నయన్ తో స్క్రీన్ షేర్ చేసుకొని అదే సినిమాతో ఫెయిల్యూర్ కూడా సమానంగా పంచుకుంది సమంతా. కాదు వాక్కుల రెండు కాదల్ మూవీ సామ్ ఫ్లాప్ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరింది. అయితే దీంతో సామ్ కి వచ్చే పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆమె చేతిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శాకుంతలంతో పాటూ యశోద, అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ వంటి వాటితో పాటూ బాలీవుడ్ లో డైరెక్ట్ గా వరుణ్ ధావన్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. మరికొన్నింటిని త్వరలోనే ప్రకటించనుంది. ఇక ఈమధ్యే శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో ఓ మూవీని పట్టాలెక్కిచింది.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

ఆడవాళ్లు మీకు జోహార్లు.. రష్మిక హడావిడీకి బ్రేక్ వేసిన సినిమా. పుష్పతో క్రష్మికగా ఫ్యాన్స్ మదిలో ఉర్రూతలూగిన ఈ హీరోయిన్.. శర్వానంద్ సినిమాతో వాళ్లని నిరాశపరిచింది. అయినా సరే పుష్ప 2తో మళ్లీ మెప్పిస్తానంటోంది. సౌత్ టు నార్త్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఈమధ్యే కోలీవుడ్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి మూవీతో పాటూ రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా సినిమాను తన అకౌంట్ లో వేసుకుంది. ఇక ఇప్పటికే రష్మిక చేస్తోన్న మిషన్ మజ్ను, గుడ్ బై, సీతారామం లాంటి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

ఒకటి అరా ఫ్లాప్స్ కే క్రేజీ హీరోయిన్స్ కాస్త బాధపడుతుంటే.. వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్నా వాటిని విధికే వదిలేసింది పూజా హెగ్డే. నా చేతిలో ఏమి లేదు సినిమా ఫ్యూచర్ ముందే రాసి పెట్టి ఉంటుందని చిలక పలుకులు పలుకుతోంది. రాధేశ్యామ్, బీస్ట్, లేటెస్ట్ ఆచార్య వరకు లైన్ కట్టి మరీ బుట్టబొమ్మకు ప్లాప్స్ ఎదురవుతున్నాయి. బట్ తను మాత్రం మహేశ్ – త్రివిక్రమ్, పవన్ – హరీశ్ శంకర్ ప్రాజెక్టులను సేఫ్ సైడ్ లో పెట్టుకుంది. ఎప్పుడు ఈ సినిమాలు మొదలైతే అప్పుడు వీటితో బిజీ కానుంది. ఈలోపు బాలీవుడ్ లో చేస్తోన్న రణ్ వీర్ సర్కస్, సల్మాన్ కభీ ఈద్ కభీ దివాళి వంటి ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉంది పూజా.

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

కీర్తి సురేశ్.. మహానటి తర్వాత అంతటి మహా హిట్ కాదు కదా మినీ హిట్ కు కూడా నోచుకోలేదు ఈ హీరోయిన్. రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినట్టు ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. పోనీ ధైర్యం చేసి పెగ్విన్, మిస్ ఇండియా లాంటి సినిమాలతో ఓటీటీ ఎంట్రీ ఇస్తే.. అక్కడా పరాజయం తప్పలేదు. బట్ సినిమాలో కంటెంట్ లేకుంటే కీర్తి చేసేదేముంది.. అందుకే ఆమెకు పిలిచి మరీ ఆఫర్ ఇస్తున్నారు మేకర్స్. చిరూ చెల్లెలిగా భోళాశంకర్, నాని సరసన దసరా సినిమాల్లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది. ఇక ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న సాని కాయిదం, మే 12న గ్రాండ్ గా థియేటర్స్ కి వచ్చేస్తోన్న మహేశ్ సర్కారు వారి పాటపై ఈసారి ఫుల్ పాజిటివ్ గా ఉంది కీర్తి సురేశ్.

Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!

అయితే, కృతిశెట్టి, శ్రీలీల, సంయుక్త మీనన్ లాంటి యంగ్ హీరోయిన్స్ వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తూ బిజిగా మారుతున్నారు. మరోవైపు శ్రీనిధి శెట్టి లాంటి వాళ్లు రూల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సాయి పల్లవి లాంటి వాళ్లు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అటు బాలీవుడ్ భామల ఎంట్రీ అదుర్స్ అనిపించే రేంజ్ లో ఉండబోతుంది. సో ఇకపై సీనియర్స్ నయన్, సామ్.. క్రేజీ గర్ల్స్ పూజా, రష్మిక లాంటి వాళ్లు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ట్రాక్ ఎక్కితేనే స్టార్ డమ్ మరి కొన్నాళ్ళు కొనసాగుతుంది.. లేదంటే కొత్త భామలలో ఎవరొకరు ఎసరు పెట్టేయడం గ్యారంటీ!

×