Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది! Star Heroins interest on Special Songs do in Star heroes Movies

Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!

వేరే భాషల్లో కూడా ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు.

Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!

Special Songs: వేరే భాషల్లో కూడా ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఫేమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదింస్తున్నారు స్టార్ హీరోయిన్స్. ఇలాగే జాతిరత్నాలుతో 2021లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్డుల్లా…ఎండిగ్ లో కూడా బంగార్రాజుతో అంతే హీట్ పెంచేసింది.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

యాంకర్ అనసూయ కూడా ఈమద్య బాగానే స్పెషల్ సాంగ్స్ చేసేస్తుంది. భోళాశంకర్ సినిమాలో చిరూ సరసన రష్మీ డాన్స్ చేస్తుందని అంటున్నారు. వీళ్లతో పాటూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి పాయల్ రాజ్ పుత్, అంజలి, ప్రియమణి లాంటి వాళ్లు రెడీగానే ఉంటారు. వీళ్లే కాకుండా అవసరమైతే బాలీవుడ్ నుంచి కూడా తెలుగు పాటల్లో స్పెషల్ గా కనిపించడానికి వచ్చేస్తున్నారు గ్లామర్ క్వీన్స్. జానపద పాటల్ని స్పెషల్ సాంగ్స్ లా తీసుకురావడం కూడా ఈమధ్య బాగా ట్రెండ్ అయింది. వరుడు కావలెనులో రీతూవర్మ దిగు దిగు నాగా అంటూ స్పెషల్ గర్ల్ కాకపోయినా స్పెషల్ నంబర్ కి డాన్స్ చేసింది. అలాగే పలాస నుంచి నాది నక్కిలీసు గొలుసు లాంటి పాటలు కూడా ఎంత హిట్ అవుతున్నాయో తెలిసిందే.

Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!

పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్. సౌత్ టు నార్త్ వరుస కమిట్ మెంట్లతో చాలా బిజీగా ఉంది. అయినా సరే వెంకీ, వరుణ్ లతో స్టెప్పులేసిందంటే ఐటమ్ సాంగ్ కున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధమైపోతుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ తో మాస్ మసాలా సాంగ్ చేయిస్తే.. విపరీతంగా ఆదరిస్తున్నారు జనం. గతంలో కూడా పూజా ఇలానే రామ్ చరణ్ కోసం స్పెషల్ గా కనిపించింది. రంగస్థలంలో జిగేలు రాణిగా అదరగొట్టింది. హై రెమ్యునరేషన్.. సూపర్ పాపులారిటీ.. బంపర్ హిట్టయితే భలే ఛాన్స్ లు.. ఇప్పుడీ లెక్కమీదే స్టార్ హీరోయిన్స్ స్పెషల్ స్టెప్పులేసేందుకు సై అంటున్నారు. బన్నీ పుష్పనే తీసుకోండి. ఫస్ట్ టైమ్ సమంత ఐటెం సాంగ్ చేసిందంటే అంతా షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ ఎందుకు చేస్తుందనుకున్నారు. కానీ చివరికి బ్లాక్ బస్టర్ కొట్టి.. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ చేసింది సామ్ సాంగ్.

Tollywood Movies : దేశాలు దాటుతున్న సినిమాలు..

సామ్ లెక్కలు సామ్ వి. పర్సనల్ విషయాలతో విసిగిపోయిందో.. సుకుమార్ అడిగారని ఒప్పేసుకుందో ఊ అనేసింది. అసలు ఊ ఊ అనే ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ కూడా బాగానే ముట్టజెప్పారని అన్నారు. పాట ఫుల్ గా వైరల్ అయిపోయి సామ్ కి లక్కీ ఛార్మ్ ను తెచ్చిపెట్టింది. తనను ఊ అంటావా గర్ల్ గానే నేషనల్ వైడ్ ఆడియెన్స్ గుర్తుపడుతున్నారని తెగ మురిసిపోయింది కూడా. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్స్ అవొచ్చు.. ఇంటర్నేషనల్ ఆడియెన్స్ అవొచ్చు పుష్ప సాంగ్ ని హమ్ చేస్తూనే ఉన్నారు. వరుణ్ తేజ్ గని మూవీలో కొడ్తే సాంగ్ తో కుర్రాళ్లని గిలిగింతలు పెట్టింది తమన్నా. ఈ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చెయ్యడం కొత్తేం కాదు. లాస్ట్ టైమ్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీలో ఆజ్ రాత్ పార్టీ అంటూ ఎంటర్ టైన్ చేసింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ పాటతో బాగానే కనెక్ట్ అయ్యారు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

సమంతా హీరోయిన్ గా నటించిన అల్లుడు శ్రీను లో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది అదీ అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనుతో. తారక్ ట్రిపుల్ రోల్ చేసిన జై లవకుశలోనూ స్వింగ్ జరా అంటూ ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు.. కెజిఎఫ్ చాప్టర్ 1లో కూడా క్లబ్ సాంగ్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది తమన్నా. గతంలో రమ్యకృష్ణ, రాశి, రంభ లాంటి వాళ్ళు కూడా స్పెషల్ సాంగ్స్ చేసారు. కానీ వాళ్ళు హీరోయిన్ గా ఫేమ్ తగ్గిన తర్వాత షురూ చేసారు. సౌందర్య లాంటి హీరోయిన్ మాత్రం కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే స్పెషల్ పాటలో కనిపించారు. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం శ్రియ‌. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రామ్ ఫస్ట్ మూవీ ‘దేవదాసు’లో ఐటెం సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మున్నా, తులసి, కొమరం పులి సినిమాలలో మెరుపులా మెరిసింది.

Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!

కాజల్ స్టార్ గా కొనసాగుతున్నప్పుడే తారక్ తో స్పెషల్ గా ఆడిపాడింది. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారెజ్ లో మెప్పించింది. హన్సిక కూడా ప్రభాస్ బిల్లాలో స్టెప్పులేసింది. సీనియర్ స్టార్ ఛార్మి ‘భాయ్’ సినిమాలో గరం ఛాయ్ అని రెచ్చిపోయింది. జేజమ్మ అనుష్క కూడా స్పెషల్ నంబర్స్ చేసింది. స్టాలిన్ మూవీలో చిరూతో, సోగ్గాడే చిన్ని నాయనాలో నాగ్ తో డాన్స్ చేసింది అనుష్కా. ఇక సలార్ బ్యూటీ శృతీ హాసన్ సైతం మహేశ్ సరసన ఆగడులో స్పెషల్ సాంగ్ లో నటించింది. మరో హీరోయిన్ రెజీనా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేసింది. కొరటాల శివ డైరెక్షన్లో ..చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆచార్య సినిమాలో శానాకష్టమే పడి యూత్ తో పాటు అందర్నీ టార్గెట్ చేసింది. మెగాస్టార్ కోసమే స్పెషల్ సాంగ్ చేశానంది రెజీనా. ఇలా ఒక వైపు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లుగా పనిచేస్తూనే.. మరో వైపు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు మన హీరోయిన్లు.

×