Movie shootings : షూటింగ్స్ తో బిజీ అయిన స్టార్ హీరోలు.. ఎవరి షూటింగ్ ఎక్కడ?

మన స్టార్ హీరోలంతా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రభాస్ ఇంకో సినిమా.............

Movie shootings : షూటింగ్స్ తో బిజీ అయిన స్టార్ హీరోలు.. ఎవరి షూటింగ్ ఎక్కడ?

Star Heros Movie shootings happening in Hyderabad surroundings

Movie shootings :  సంక్రాంతికి స్టార్ హీరోలు వచ్చి థియేటర్స్ లో సందడి చేశారు. అప్పటినుండి వరుసగా అన్ని చిన్న, మీడియం సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఇక మన స్టార్ హీరోలంతా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రభాస్ ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర విరమల్లు సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఏకర్స్ లో శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మాదాపూర్ ప్రవేట్ హాస్పిటల్ లో జరుగుతుంది. ఇక్కడి షెడ్యూల్ అయ్యాక అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూట్ చేయనున్నారు. ఇందుకోసం అక్కడ సెట్ కూడా వేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ సినిమా పుష్ప2 షూటింగ్ వైజాగ్ గత కొద్దీ రోజులుగా వైజాగ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

Shivanna- Balayya : శివన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య.. శివన్న-బాలయ్య కాంబోలో సినిమా??

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న నాని 30వ సినిమా షూటింగ్ బాచుపల్లిలో జరుగుతుంది. రవితేజ రావణాసుర సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది. నాగ చైతన్య కస్టడీ సినిమా షూటింగ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతుంది. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ జమ్మల మడుగు గండికోటలో జరుగుతుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. సాయిధరమ్ తేజ్ విరుపాక్ష సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. దీంతో స్టార్ హీరోలంతా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. అభిమానులు వీళ్ళ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.