Movie Shootings : స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా?

షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిరుపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది.

Movie Shootings : స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా?

Star Heros Movie Shootings Updates

Movie Shootings :  స్టార్ హీరోలంతా తమ సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు రిలిజ్ ఏమి లేవు. చిన్న, మీడియం హీరోలంతా సమ్మర్(Summer) లో సినిమా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటుంటే పెద్ద హీరోలంతా షూటింగ్స్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ సినిమా ‘వేదాళం’కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే, కీర్తి సురేశ్ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ కాబోతోంది. అందుకే షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో చిరుపై యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానూ, శ్రీలీల కీలక పాత్రలోనూ నటిస్తున్నారు. ఇది బాలయ్య కెరీర్ లో 108వ సినిమా. ఈ ఏడాది విజయ దశమి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు లోని బూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య, ఇంకా ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

విక్టరీ వెంకటేశ్ అప్ కమింగ్ మూవీ సైంధవ్. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దీనికి డైరెక్టర్. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. వెంకీ పవర్ ఫుల్ గా నటిస్తున్న సైంధవ్ ఈ ఏడాది డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం వైజాగ్ డాక్ యార్డ్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెంకీ అండ్ మిగిలిన నటీనటులపై క్రూసియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. విదేశీ ఫైటర్ల ఆధ్వర్యంలో ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ OG షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ గా పవన్ నటిస్తుండగా పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సీక్వెన్స్ జరుగుతోంది.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వజ్ర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతున్న నాని 30వ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.