Star Heros : యాంకర్స్ గా మారుతున్న స్టార్ హీరోలు

స్టార్ హీరోలు యాంకర్స్ గా మారి అభిమానుల్ని అలరిస్తున్నారు. దీనికి పారితోషకం కూడా భారీగానే తీసుకుంటున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటిసారిగా

Star Heros : యాంకర్స్ గా మారుతున్న స్టార్ హీరోలు

Star Heros

Star Heros :  ఒకప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్స్ అంటే కేవలం సినిమాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇటీవల బుల్లితెర పైన కూడా కనిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు బుల్లి తెరపై షోస్ లో సందడి చేస్తున్నారు. ఇక మన స్టార్ హీరోలు కూడా యాంకర్స్ గా మారి అభిమానులని అలరిస్తున్నారు. అభిమానులు తమ హీరోలని సినిమా వచ్చేదాకా వెయిట్ చేసి థియేటర్ కి వెళ్లి సినిమాలో చూసేవారు. ఇప్పుడు టీవీల్లో, ఓటిటిల్లో కూడా కనపడుతుండటంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

Katrina Kaif : త్వరలోనే కత్రినాకైఫ్ తో నిశ్చితార్థం.. స్వయంగా చెప్తా అన్న విక్కీ కౌశల్

స్టార్ హీరోలు యాంకర్స్ గా మారి అభిమానుల్ని అలరిస్తున్నారు. దీనికి పారితోషకం కూడా భారీగానే తీసుకుంటున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటిసారిగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంకి యాంకర్ గా చేశారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ షోకి వరుసగా మూడు సీజన్ల నుంచి యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి ఒక సీజన్ లో యాంకర్ గా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్ సీజన్ 1’లో యాంకర్ గా చేసి అదరగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో హోస్టుగా మారి అభిమానులను అలరిస్తున్నారు. రానా దగ్గుబాటి ‘నెంబర్ వన్ యారీ’ షోకి యాంకర్ గా మూడు సీజన్ల నుంచి చేస్తున్నారు. నాచురల్‌ స్టార్‌ నాని ‘బిగ్ బాస్ సీజన్ 2’కు యాంకర్ గా వ్యవహరించారు. ఒకప్పటి హీరో ప్రస్తుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్ ‘వావ్’, ‘మనం’ షోలతో ఎన్నో సీజన్లుగా అలరిస్తున్నారు. జగపతిబాబు కూడా హోస్టుగా మారి ‘కో అంటే కోటి’ అనే ప్రోగ్రాం చేశారు. ఇటీవల కూడా ఒక టాక్ షో ప్రారంభించారు కానీ అది కరోనా వల్ల ఆగిపోయింది.

Bigg Boss 5 : రవికి చాలా దూరంగా ఉండాలి.. అనీ మాస్టర్ టాప్ 5 లో ఉండాలి : శ్వేతా వర్మ

ఇప్పుడు తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. ఈ షో త్వరలోనే టెలికాస్ట్ కానుంది.