Star Kids : వారసులు ఇంకా వస్తున్నారు.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్..

సినీ పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీల వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమలలో చాలా మంది స్టార్స్ వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరింతమంది ఎంట్రీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మన టాలీవుడ్ లోనే పలువురు స్టార్ కిడ్స్..............

Star Kids : వారసులు ఇంకా వస్తున్నారు.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్స్..

Star Kids :  సినీ పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీల వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. ఇప్పటికే అన్ని సినీ పరిశ్రమలలో చాలా మంది స్టార్స్ వారసులు ఎంట్రీ ఇచ్చారు. మరింతమంది ఎంట్రీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మన టాలీవుడ్ లోనే పలువురు స్టార్ కిడ్స్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఇప్పుడు మినిస్టర్ అయిన రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక టాలీవుడ్ ఎంట్రీ పై గతంలో చాలానే వార్తలొచ్చాయి. అప్పుడు ఎలాంటి క్లారిటీ లేకపోయినా లేటెస్ట్ గా ఆమె అరంగేట్రం గురించి రోజా నోరు విప్పారు. తన 50వ బర్త్ డేను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనార్ధం వెళ్లిన రోజా మీడియాతో మాట్లాడుతూ.. అన్షు హీరోయిన్ అవ్వాలనుకుంటే తాను కాదనని, ఆమె ప్రెజెంట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటోంది. ఎప్పుడు సినిమాల్లోకి రావాలనుకుంటే అప్పుడొస్తుంది. అని క్లారిటీ ఇచ్చారు. దాంతో అన్షు మాలిక ఎంట్రీ లేట్ అయిన ఖాయం అని అనుకుంటున్నారు అంతా.

టాలీవుడ్ లో మరో మోస్ట్ వాంటెడ్ నటవారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. అతడి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ అరంగేట్రం గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే ఆ మధ్య బాలయ్యే స్వయంగా తన డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ అది ఎప్పుడన్నది ఫ్యాన్స్ కు అంతు బట్టడం లేదు. అయినప్పటికీ మోక్షజ్ఞ సినిమా ఫలానా డైరెక్టర్ తీస్తున్నాడు ఫలానా నిర్మాత నిర్మిస్తున్నాడు. అనే వార్తలు మాత్రం వస్తునే ఉన్నాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడో చూడాలి.

 

దగ్గుబాటి వారి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీకి అంతా సిద్ధమయింది. సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. తేజ డైరెక్షన్ లో రాబోతున్న ఆ సినిమా పేరు ‘అహింస’. ఇదో డిఫరెంట్ లవ్ స్టోరీ. తేజా ట్రేడ్ మార్క్ టేకింగ్ తో, ఆర్పీ పట్నాయక్ పాటలతో ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అంచనాలని పెంచేసింది. తేజ ఎర్లియర్ మూవీస్ ‘జయం, నువ్వు నేను’ తరహాలో ఈ టీజర్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

నిన్నటి తరం హీరోల్లో 100 సినిమాలకు పైగానే పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసిన హీరో శ్రీకాంత్. ఆయన ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఒక హీరో వచ్చాడు. ‘పెళ్ళిసందడి’ సినిమాతో హీరోగా మెప్పించాడు రోషన్. ఫస్ట్ అటెమ్ట్ లో హీరోగా మంచి మార్కు లేయించుకొని మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వారసురాలు రాబోతోందని టాక్. శ్రీకాంత్ కూతురు హీరోయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. కూతురు మేథ అచ్చం తల్లి ఊహలాగానే ఉంటుంది. మంచి బ్యానర్, మంచి స్టోరీ దొరికితే ఆమె హీరోయిన్ గా సినిమా తెరకెక్కించడానికి శ్రీకాంత్ రెడీగా ఉన్నాడని టాక్. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

Rajamouli : నా నెక్స్ట్ మూవీ ఇండియానా జోన్స్ లా అడ్వెంచరస్ సినిమా.. ఫుల్ ఖుషీలో మహేష్ ఫ్యాన్స్..

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కుర్రాడు బాబాయ్ మహేశ్ బాబు పెర్సనాలిటీ, తండ్రి రమేశ్ బాబు ఫేస్ కట్స్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. రీసెంట్ గా కృష్ణ మరణించడంతో అమెరికా నుంచి ఒక రోజు లేట్ గా వచ్చాడు జయకృష్ణ. ఆయనకి నివాళులర్పించడానికి వచ్చినప్పుడు మీడియా కంటపడ్డాడు. ఆ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు జయకృష్ణ. ప్రస్తుతం ఇతడు అమెరికాలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అది పూర్తవగానే మహేశ్ అతడి ఎంట్రీ బాధ్యతను తీసుకోబోతున్నాడని సమాచారం.

మాస్ మహారాజా రవితేజ నట వారసుడు మహాధన్ రాజాది గ్రేట్ లో జూనియర్ రవితేజగా ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి మహాధన్ హీరోగా ఎంట్రీ ఎప్పుడుంటుందని అభిమానుల్లో ఆత్రుత ఎక్కువైంది. మరో పక్క రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ ‘ఏయ్ పిల్లా’.. సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో మహాధన్ హీరో ఎప్పుడవుతాడని అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది. మహాధన్ హీరో ఎంట్రీ కూడా పక్కా ఉంటుంది అంటున్నారు.