Tollywood Star's: హైప్ ఉన్నప్పుడే హైని చూసేయాలి.. ఇదే ఇప్పుడు ట్రెండ్! Star's Hype should be seen only when there is hype .. this is the trend now in Tollywood

Tollywood Star’s: హైప్ ఉన్నప్పుడే హైని చూసేయాలి.. ఇదే ఇప్పుడు ట్రెండ్!

మెగాస్టార్ మాత్రమే కాదు... హైప్ ఉన్నప్పుడే హై ని చూడాలనేది మరికొందరి స్టార్స్ ప్లాన్ కూడా. పవన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు

Tollywood Star’s: హైప్ ఉన్నప్పుడే హైని చూసేయాలి.. ఇదే ఇప్పుడు ట్రెండ్!

Tollywood Star’s: మెగాస్టార్ మాత్రమే కాదు… హైప్ ఉన్నప్పుడే హై ని చూడాలనేది మరికొందరి స్టార్స్ ప్లాన్ కూడా. పవన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మంచి కమర్షియల్ కథతో డైరెక్టర్ దొరికితే… దాన్ని బ్యాకప్ చేసి.. అడిగినంత రెమ్యునరేషన్ తో ప్రొడ్యూసర్ సై అంటే చాలు ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు టాలీవుడ్ స్టార్స్. అందుకే ఈమధ్య కాలంలో వినని, చూడని లైనప్స్ ఆడియెన్స్ ముందుకొచ్చేస్తున్నాయి.

Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

స్టార్ డం ఉన్నప్పుడే సంపాదించాలనే లిస్ట్ లో పవర్ స్టార్ కూడా ఉన్నారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫ్యాన్స్ ఉన్నప్పుడు చకచకా సినిమాలు చేసేస్తే తప్పేంటనేది పవర్ స్టార్ అభిప్రాయం. అందుకే నిన్నమొన్నటి వరకు కాస్త స్లోగానే కనిపించిన పవర్ స్టార్… ఇప్పుడు క్యూలో సినిమాలను పెడుతున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లు వసూలు చేసే పవర్ స్టార్ కోసం.. అంతివ్వడానికి మేకర్స్ కూడా రెడీగా ఉన్నారు. పవన్ డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేసే దర్శకనిర్మాతలు చాలామంది.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

అటు రాజకీయాలకు టైమ్ స్పెండ్ చేయాలి పవర్ స్టార్. ఎన్నికలు దగ్గరపడ్డాయంటే సినిమాలకు కొన్ని రోజులు దూరం కావాల్సిఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే లైనప్ పెంచేస్తున్నారు పవర్ స్టార్. రీసెంట్ గా నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీఅయింది. హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. హరీశ్ శంకర్ భవధీయుడు భగత్ సింగ్ మొదలెట్టాల్సి ఉంది పవన్ కల్యాణ్. ప్రకటించాల్సిన సినిమాలు పవన్ డైరీలో మరో రెండు రెడీగా ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథే వేరు. గ్లోబల్ స్టార్ స్టేజ్ కి ఎదిగిన తర్వాత ప్రాజెక్ట్ను బట్టి 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు డార్లింగ్. అందుకే ఇలాంటి స్టార్ డం ఉన్నప్పుడే ఒకేసారి చాలా సినిమాలకు సైన్ చేసారు ప్రభాస్. రిలీజ్ కి రెడీ అయిన రాధే శ్యామ్ తర్వాత సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.

Amala Paul: అమలా హాట్ లుక్స్ కిల్లింగ్ అంతే!

ఇవే కాకుండా మైత్రి బ్యానర్‌లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్‌పై మరొక సినిమాతో పాటూ మారుతీ దర్శకత్వంలో ఇంకో ప్రాజెక్టుకు కూడా కమిటైనట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 42 ఏళ్లను క్రాస్ చేసిన ప్రభాస్ వయసు మరీ ముదరక ముందే మూవీ స్పీడ్ పెంచే ప్రాసెస్ లో ఉన్నారు. వీలైనన్నీ సినిమాలను ముందుకు తీసుకొచ్చి వేల కోట్లను వెనకేసుకోవాలనే ఆలోచన డార్లింగ్ ది. అటు వెంటవెంటనే ప్రభాస్ సినిమాలొస్తున్నాయంటే ఫ్యాన్స్ కు కూడా పండుగే కదా.

Katrina Kaif: పెళ్ళైనా.. దాచుకొనేదేలే!

క్రాక్ తో పెరిగిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు మాస్ రాజా. 53ఏళ్ల వయసులో ఉన్న రవితేజ సైతం మిగిలిన హీరోలకు షాకిస్తున్నారు. ఖిలాడి రిలీజ్ కి రెడీ కాగా… లైనప్ లో ధమాకా, రామారావ్ ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలు ఉన్నాయి. చిరూ – బాబీ సినిమాలో కూడా మాస్ రాజా ఫైనల్ అయినట్టే. మరీ చిరూ, ప్రభాస్, పవన్ లా రెమ్యునరేషన్ హైగా హైక్ చేయలేదు కానీ… ఒక్కో సినిమాకు గట్టిగానే రాబడుతున్నారు రవితేజ.

Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..

ఈ కాన్పెస్ట్ ను ఫాలో అవ్వాలనే కాన్షియస్ నెస్ మరికొంతమంది హీరోల్లో కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. నాని లాంటి హీరోలు ఇది కనిపించకుండా అమలుచేస్తున్నదే. ఇప్పుడీ లిస్ట్ లోకి హై స్టార్ డం ఉన్న రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలు కూడా త్వరలోనే వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

×