Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

రియల్ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్ చెయ్యడం అనేది దాదాపు ప్రతీ సినిమా స్టార్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్. పాత తరం స్టార్ల నుంచి ఈ యంగ్ జనరేషన్ స్టార్లవరకూ ఒక్క చోటే కాకుండా రియల్ ఎస్టేట్స్..

Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

Stars Investments

Stars Investments: రియల్ ఎస్టేట్‌ రంగంలో ఇన్వెస్ట్ చెయ్యడం అనేది దాదాపు ప్రతీ సినిమా స్టార్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్. పాత తరం స్టార్ల నుంచి ఈ యంగ్ జనరేషన్ స్టార్లవరకూ ఒక్క చోటే కాకుండా రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్ కమ్ వచ్చేలా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

హీరోలంటే జస్ట్ సినిమాలు చెయ్యడమే కాదు.. ఎవరో ధియేటర్లు ఇచ్చే వరకూ వెయిట్ చేసి చూడటం ఎందుకని.. సొంతగా ధియేటర్లు కట్టేసుకుని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ధియేటర్ల జోలికి మాత్రం వెళ్లలేదు. ఎన్టీఆర్ సినిమాలతో పాటు.. యాడ్స్, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి షోస్ కూడా హోస్ట్ చేస్తుంటారు. ఇలా తను సంపాదించిన మనీని కళ్యాణ్ రామ్ తో స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌజ్ తో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

Telugu Stars: ప్రజల కోసం సివిల్ సర్వెంట్స్.. రూటు మార్చిన మాస్ హీరోలు!

చరణ్ మాత్రం తన ఇన్ కమ్ ని చాలా సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు వరకూ ఎయిర్ వేస్ లో ఇన్వెస్ట్ చేసిన చరణ్.. ఇప్పుడు ఉపాసనతో కలిసి హెల్త్ ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారు. అంతేకాదు.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి సైరా, ఆచార్య లాంటి క్వాలిటీ మూవీస్ చేస్తూ.. తన మనీని స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు చరణ్. ఈ మెగా పవర్ స్టార్ కూడా మూవీస్ తో పాటు టాప్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూంటారు.

Stars Divorce: ఏళ్ల బంధానికి గుడ్ బై.. మా కొద్దీ పెళ్లిళ్లంటున్న స్టార్స్

బన్నీ తన సినిమాకు తీసుకనే 50 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు.. టాప్ బ్రాండ్ యాడ్స్ తో ఫుల్ గా సంపాదిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఏషియన్ గ్రూప్ తోనే కలిసి హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నారు. అమీర్ పేట్ బిగ్ బజార్ పక్కన మల్టీప్లెక్స్ ప్లాన్ తో పాటు, ఫేమస్ ధియేటర్ ని కూడా మల్టీప్లెక్స్ గా మార్చే ప్లాన్ లో బిజీగా ఉన్నారు బన్నీ. వీటితో పాటు ఆహా ఓటీటీ యాప్ డెవలప్ మెంట్ కి కూడా తన మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటితో పాటు మల్టిప్లెక్స్ కి పార్టనర్ గా కూడా ఉంటున్నారు బన్నీ.

Bollywood Stars: లేట్‌లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!

నిన్న కాకమొన్నొచ్చిన విజయ్ దేవరకొండ కూడా సినిమాకి 25 కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. రకరకాల టాప్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ మనీ అంతా చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగారు. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏషియన్ దేవరకొండ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు.. అల్ట్రా మోడర్న్ గా అన్ని ఫెసిలిటీస్ తో లావిష్ గా కట్టించిన ఏవీడీ మల్టీప్లెక్స్ తో పాటు హిల్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు విజయ్ దేవర కొండ. అంతేకాదు.. రౌడీ వేర్ అంటూ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసి స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ రౌడీ హీరో.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

ఈ యంగ్ హీరోలతో పాటు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరోలు కూడా తమ కోట్ల రెమ్యూనరేషన్ డబ్బునంతా స్టూడియెస్ త్రూ ఇన్వెస్ట్ చేశారు. అంతేకాదు.. దాదాపు 30, 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ స్టార్లందరూ రియల్ ఎస్టేట్ తో పాటు మూవీ ప్రొడక్షన్ లో పెట్టుబడులు పెట్టారు. బాలకృష్ణ అయితే హెల్త్ రిలేటెడ్, మెడికల్ ఫీల్డ్ లో కూడా ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టారు. నాగార్జున మాత్రం రెస్టారెంట్, మాల్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు.

Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా మేమేం తక్కువా అంటూ కోట్లకు కోట్లకు సంపాదించిన డబ్బంతా చాలా క్లెవర్ ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. ఇటు సినిమాలు, యాడ్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని ఫ్యూచర్ కోసం బాగానే పెట్టుబడి పెడుతున్నారు. టాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ తన డబ్బుని.. ఫిట్ నెస్ ఫ్రాంచైజ్ లతో పాటు.. సొంతగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి దాన్లో పెట్టుబడి పెడుతోంది.

Tollywood Stars: ఏడ్చి.. ఏడిపించేసి.. టాలీవుడ్ స్టార్స్ ఎమోషనల్ టచ్!

ఇక రాశి ఖన్నా కూడా రెస్టారెంట్లతో పాటుమరికొన్ని స్టార్టప్స్ కి ఇన్వెస్ట్ చేస్తోంది. కాజల్ సొంతగా డెకార్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ మెంట్ చేస్తోంది. తమన్నా బ్యూటీ ప్రొడక్ట్స్ తో ఎంగేజ్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంతా.. ఏకమ్ స్కూల్ తో పాటు.. సాకి అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తోంది. ఇలా హీరోలతో పాటు హీరోయిన్లు కూడా స్మార్ట్ గా తమ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు.