నాగ్, రకుల్ జంట అదిరిందిగా!

మన్మథుడు-2 నుండి అఫీషియల్‌గా మరికొన్ని ఫోటోలు వచ్చాయి. నాగ్ న్యూ లుక్‌లో చాలా బాగున్నాడు. నాగ్, రకుల్ పెయిర్ బాగుంది..

  • Published By: sekhar ,Published On : April 26, 2019 / 11:48 AM IST
నాగ్, రకుల్ జంట అదిరిందిగా!

మన్మథుడు-2 నుండి అఫీషియల్‌గా మరికొన్ని ఫోటోలు వచ్చాయి. నాగ్ న్యూ లుక్‌లో చాలా బాగున్నాడు. నాగ్, రకుల్ పెయిర్ బాగుంది..

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా.. మన్మథుడు-2.. 2002లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిమ్.. మన్మథుడుకి సీక్వెల్‌గా రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పోర్చుగల్‌లో స్టార్ట్ అయ్యింది. నాగ్, రకుల్, వెన్నెల కిషోర్ తదితరులు షూట్‌లో పాల్గొంటున్నారు. మొన్నామధ్య, కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రమే మీకోసం.. అంటూ రాహుల్,   నాగ్ సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్న పిక్స్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మన్మథుడు-2 నుండి అఫీషియల్‌గా మరికొన్ని ఫోటోలు వచ్చాయి. నాగ్ న్యూ లుక్‌లో చాలా బాగున్నాడు. నాగ్, రకుల్ పెయిర్ బాగుంది. పనిలో పనిగా నాగ్, రకుల్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేసాడు నాగ్.. ఈ మూవీలో అక్కినేని కోడలు సమంత గెస్ట్ రోల్ చెయ్యనుంది.. వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. డిసెంబర్‌లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.