Mahesh Babu: పీకాక్‌ మేగజీన్‌ కవర్‌ పేజీపై స్టయిలిష్ మహేశ్..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మరికొన్ని గంటలలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మహేష్..

Mahesh Babu: పీకాక్‌ మేగజీన్‌ కవర్‌ పేజీపై స్టయిలిష్ మహేశ్..!

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్‌ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మరికొన్ని గంటలలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మహేష్.. వరుస ఇంటర్య్వూలు, ప్రెస్‌మీట్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై కనిపించి తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు మహేష్. ద పీకాక్‌ మేగజీన్‌ కవర్‌ పేజీ కోసం ఆయన ఇటీవల ఫొటోషూట్‌లో పాల్గొనగా ఈ విషయాన్ని మహేశ్‌ స్వయంగా తెలిపారు.

Sarkaru Vaari Paata: పంచులతో పిచ్చెక్కించనున్న మహేష్!

ద పీకాక్ మేగ‌జీన్ క‌వ‌ర్ పేజీపై తను ఉన్న ఫొటోను స్వ‌యంగా మ‌హేశ్ బాబు తన సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. తన ఫొటోలు కవర్ పేజీపై ప్రచురించినందుకు ద పీకాక్ మేగ‌జీన్‌కు మహేష్ బాబు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫొటో కోసం జ‌రిగిన షూట్ అంత కూడా చాలా ఉల్లాసంగా గ‌డిచింద‌ని మహేష్ బాబు పేర్కొన్నాడు . అలాగే ఆ షూట్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డ ద పీకాక్ మేగ‌జీన్ జ‌ర్న‌లిస్టులు ఫాల్గుణి, షేన్‌ల‌కు కూడా మ‌హేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు.

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!

ఇక మేగ‌జీన్ కవర్ పేజ్ పై స్టైలిష్ లుక్ లో ఉన్న మహేష్ బాబు ఫోటోలను చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మా మహేశ్ ముందు ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనని.. మా హీరోకు అందం పెరుగుతూ ఏజ్ తగ్గుతూ మరింత యంగ్ అయిపోతున్నాడని మహేశ్ అభిమానులు మురిసిపోతున్నారు. ఏ మాటకామాట ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పాటు ఇంకా రాబోయే కుర్ర హీరోలకు కూడా మహేశ్ పోటీ ఇచ్చే అంత యంగ్ గా మారిపోతున్నాడు.