బన్నీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు!

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 03:38 PM IST
బన్నీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు!

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళంలోనూ అభిమానులున్నారు. అక్కడ బన్నీ సినిమాలు సాధించే కలెక్షన్లు కానీ కేరళ వెళ్లినప్పుడు అక్కడివారు బన్నీపై చూపించి ఆదరణ కానీ చూస్తే అర్థమైపోతుంది అతనికి ఏ రేంజ్ క్రేజ్ ఉందో.. ‘అల వైకుంఠపురములో’ సినిమా మలయాళంలో మంచి సాధించింది.



Allu Arjun



రీసెంట్‌గా బన్నీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ 8 మిలియన్ మార్క్ టచ్ చేసింది. అర్జున్ ఇన్‌స్టాలోకి ఎంటరైన తక్కువ టైంలోనే ఈ రేర్ ఫీట్ సాధించడం విశేషం.



ఈ సందర్భంగా అ‍ల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘8 మిలియన్స్‌ అనేది కేవలం ఫాలోవర్స్‌ కాదు, అది నెంబర్‌, స్టాటిస్టిక్స్‌, పాపులారిటి కాదు అది అంతులేనంత అభిమానం, ఆశీర్వాదం. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. నేను శిరసు వంచి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’.. అంటూ 8 మిలియన్స్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ బన్నీకి విషెస్ తెలియజేస్తున్నారు.



https://www.instagram.com/p/CD_UEWJH-j4/?utm_source=ig_web_copy_link