అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : August 20, 2020 / 01:19 PM IST
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అల్లు అర్జున్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

Allu Arjun’s Ultra Stylish Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరుకి తగ్గట్టే ఎప్పటికప్పుడు ట్రెండీ ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంటాడు. ముఖ్యంగా యూత్‌ బన్నీ స్టైల్‌, ఫ్యాషన్‌ను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సినిమాలతో పాటు బయట కూడా బన్నీ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడనే సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత తన హోం బ్యానర్ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లానని చెబుతూ బన్నీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.



‘‘చాలా కాలం త‌ర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్క‌డ ఎలాంటి హడావుడి లేదు. క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డిన ఈ‌ గ‌డ్డు ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే అంతం కావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా టీ ష‌ర్టు ధ‌రించి, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో ఆఫీసు ప్రాంగ‌ణంలో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ లుక్‌లో బ‌న్నీని చూసిన అబిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ‘‘ఏంటి అన్నయ్య.. కనపడిన ప్రతీ సారి ఏదో ఒక కొత్త లుక్‌లో దర్శనం ఇస్తూ ఉన్నారు’.. అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు.
‘మేము అదే అనుకుంటున్నాం అన్నా.. తొంద‌ర‌గా షూటింగ్ స్టార్ట్ అవాలి. నిన్ను మ‌ళ్లీ స్క్రీన్ మీద చూడాలి’.. అని మ‌రో అభిమాని రాసుకొచ్చారు.



కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవ‌ర్ల సంఖ్య 8 మిలియ‌న్లు దాటేసిన విష‌యం తెలిసిందే. బన్నీ తాజాగా న‌టిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘‘పుష్ప’’‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. లాక్‌డౌన్ ముగిశాక బన్నీ షూటింగులో పాల్గొంటారు.



https://www.instagram.com/p/CEGcIxHHNyF/?utm_source=ig_web_copy_link