Stylish Villains : సూపర్ విలన్స్..!

సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా హీరోని మించిన విలన్ అనే కాన్సెప్ట్ ట్రెండ్ నడుస్తుంది..

Stylish Villains : సూపర్ విలన్స్..!

Stylish Villains

Stylish Villains: ఒకప్పుడు విలన్ అంటే.. హీరోను డామినేషన్ చేయడానికి వీల్లేదు.. హీరో చేతిలో చావు దెబ్బలు తినాలి.. అప్పుడప్పుడు హీరోని ఓ దెబ్బ కొట్టే ఛాన్స్ మాత్రమే ఉండేది మన సినిమాల్లో.. కానీ రాను రాను ఈ పాత ఫార్మాట్‌ను వదిలేస్తున్నారు.. ఇప్పుడు హీరోని మించిన విలన్లను వెతికి మరీ తెచ్చి పెట్టుకుంటున్నారు.. మరి ఈ ఫార్ములా ఇండస్ట్రీకి బాగా వర్కౌట్ అయ్యినట్టుంది…

Ram Pothineni : రామ్ పోతినేని మెడకు గాయం

ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా హీరోని మించిన విలన్ అనే కాన్సెప్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు హీరో కంటే విలన్ తక్కవ.. ఆ తరువాత హీరోకి సమానమైన ఇమేజ్ ఉన్న విలన్లను పెట్టడం ట్రెండ్ అయ్యింది. మొన్నటి వరకూ అదే ట్రెండ్ నడిచింది. కానీ ఇప్పుడు హీరోని మించిన ఇమేజ్ ఉన్న విలన్ల కాంబినేషన్లు.. సినిమాలకు సక్సెస్‌ఫుల్ ఫార్ములాలు అయ్యాయి.. ఈ ట్రెండ్ బాగా వర్కౌట్ అవుతుండటంతో చాలా సినిమాలకు ఇది అప్లై చేస్తున్నారు.

Vidyu Raman : మాల్దీవుల్లో రచ్చ చేసిన లేడీ కమెడియన్..

రీసెంట్‌గా విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబో సినిమా ‘లైగర్’ లో హాలీవుడ్ స్టార్ యాక్టర్ మైక్ టైసన్ నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను బట్టి చూస్తే.. టైసన్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ విజయ్ దేవరకొండ.. ఎక్కడ మైక్ టైసన్.. ఆ రేంజ్ హీరోను విజయ్‌‌కు ఆపోజిట్ లీడ్‌లో చూపించబోతున్నారు పూరీ టీమ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. టైసన్‌ను పూరీ ఎలా వాడబోతున్నాడో చూడాలి. మరి టైసన్ ఇమేజ్.. విజయ్‌ను డామినేట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి..?

Mike Tyson : ‘లైగర్’ కోసం బాక్సింగ్ లెజెండ్..

‘కెజియఫ్’ ఫస్ట్ పార్ట్ ఊహించని విధంగా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అవ్వడంతో.. త్వరలో రిలీజ్ కాబోయే సెకండ్ పార్ట్‌ను అంతకు మించి అన్నట్టు ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్‌లో లోకల్ విలన్లతో నడిపించిన నీల్ సెకండ్ పార్ట్‌కు వచ్చే సరికి బాలీవుడ్ దాదా సంజయ్ దత్‌ను రంగంలోకి దించాడు. హీరో యష్‌కు ‘కెజియఫ్’ తోనే కొంచెంగా పాన్ ఇండియా ఇమేజ్ తగిలింది.. ఈ టైమ్‌లో బాలీవుడ్ స్టార్‌తో యష్‌కు పోటా పోటీ వార్‌ను చూపించబోతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్. మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి..

KONDA : తెలంగాణ ‘రక్తచరిత్ర’

హీరో స్టైలిష్‌గా ఉండాలి.. ఫైట్లు, డ్యాన్స్.. రొమాన్స్.. ఇలా అన్ని రకాలుగా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలి.. ఎట్ ది సేమ్ టైమ్ విలన్ హీరోకి ఆపోజిట్.. డీ గ్లామర్.. కారెక్టర్ లెస్.. నో ఎథిక్స్.. ఇలా డిజైన్ చేసేవారు.. కానీ కొన్ని సినిమాలు ఈ ఓల్డ్ ట్రెండ్‌ను పాత్ బ్రేక్ చేశాయి.. ఇప్పుడు అంతా ఆపోజిట్ అయిపోయింది..

Aaradugula Bullet : తనను మెయింటైన్ చెయ్యమంటున్న నయనతార..

స్టైలిష్ విలన్లు.. హీరోలను మించి గ్లామర్‌తో .. హీరోలను మించిన ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఎక్కువగా ఓల్డ్ హీరోలంతా విలన్లుగా సెటిల్ అవుతూ.. హీరోల గ్లామర్‌కు పోటీ ఇస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్‌లో పిల్ల హీరోలకు సీనియర్ హీరోలు విలన్లుగా మారుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మెగా ప్రిన్స్ మూవీ ‘గని’ లో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఆయన ఆల్‌రెడీ మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ లో నటించారు. వరుణ్ ‘గని’ మూవీ బాక్సింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తోంది. మరి ఈ సినిమాలో సునీల్ శెట్టిని డైరెక్టర్ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో చూడాలి..

Uttej Emotional Words : ‘చాలా నొప్పిగా ఉంది పద్దూ’.. కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ మాటలు..

అటు కుర్ర హీరోలకు సీనియర్ స్టార్ హీరోలు విలన్స్‌గా మారుతుంటే.. ఇటు మన యంగ్ హీరో సీనియర్ హీరోకు విలన్‌గా చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘వాలిమై’ మూవీలో మన టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. సిక్స్ ఫీట్ హైట్.. టోన్డ్ బాడీతో కార్తికేయ హీరోగా.. స్టైలిష్ విలన్‌గా రచ్చ చేస్తున్నాడు. ఆల్‌రెడీ నానీ ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్‌గా కార్తికేయ మెస్మరైజ్ చేశాడు.

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

రీసెంట్‌గా తమిళ హీరో విజయ్ సేతుపతి.. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ లో విలన్‌గా నటించారు.. బాలీవుడ్ హీరోలు కొంతమంది ఇమేజ్ వెయిట్‌ను పక్కన పెట్టి.. సౌత్ మూవీస్‌లో మెరిపించడానికి రెడీ అంటున్నారు. ‘పుష్ప’ మాదిరిగా హీరోలు డీ గ్లామర్ రోల్స్ చేస్తూ.. స్టైలిష్ విలన్లతో పోరాడ్డానికి కూడా వెనకడుగు వేయడంలేదు..