Avengers end game సక్సెస్ వెనుక సీక్రెట్ ఇదే

  • Published By: Subhan ,Published On : June 13, 2020 / 09:33 AM IST
Avengers end game సక్సెస్ వెనుక సీక్రెట్ ఇదే

ప్రపంచంలోని సినిమాలన్నింటిలో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ భారీ  బడ్జెట్ సినిమా అన్ని సినిమాల రికార్డులు తుడిచిపెట్టేసి నంబర్ వన్ అనిపించుకుంది. ఈ విజువల్ వండర్ లో క్లైమాక్స్ సీన్స్ కోసం 14 వేల మందికి పైగా పనిచేశారని మీకు తెలుసా..?

2500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హాలీవుడ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మార్వెల్స్ .. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇప్పటి వరకూ వరల్డ్ నెం 1 కలెక్షన్ల రికార్డు ఉన్న సినిమాలను ఓవర్ టేక్ చేసి అవెంజర్స్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి కారణం ఎండ్ గేమ్ లో ఎగ్జైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్. హాలీవుడ్ సూపర్ హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించిన ఎండ్ గేమ్  తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డారు మేకర్స్. 

స్పెషల్లీ ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ కోసం ..14 వేలమంది విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుల్ని వాడినట్టు చెబుతున్నారు.  థానోస్ కి అగైనెస్ట్ గా వచ్చే వందలకొద్దీ మార్వెల్ క్యారెక్టర్స్ ని సృష్టించడం కోసం, అందులో యాక్షన్ కోసం దాదాపు 16 వారాల పాటు పనిచేస్తే ..అంత అద్బుతమైన అవుట్ పుట్ వచ్చినట్టు చెబుతున్నారు మేకర్స్.

ఆంటోనీ, జో రుస్సో డైరక్షన్‌లో రూపొందిన ఈ మూవీలో ఫస్ట్ నుండి అవేంజర్ సిరిస్ మూవీస్ లో నటిస్తూ వస్తోన్న రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఎవాన్స్‌ లు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు అవెంజర్స్ సిరిస్ మూవీస్ లో కనిపించిన కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, హల్క్, థార్ ,స్పైడర్ మాన్, బ్లాక్ పాంతర్, కెప్టెన్ మార్వెల్… లాంటి ఫేవరెట్ సూపర్ హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించి విజువల్ ట్రీట్ ఇచ్చారు. అందుకే ఈ సినిమా లార్జర్ ద్యాన్ లైఫ్ మూవీగా నిలిచిపోయింది.