Sudha Chandran: కాలు తొలగించమంటున్నారు మోదీ గారు.. సాధ్యమేనా?

సుధా రామచంద్రన్ కు ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. నృత్యకారిణిగా ఆమె కళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ ప్రమాదంలో కాలు కోల్పోయినా..

Sudha Chandran: కాలు తొలగించమంటున్నారు మోదీ గారు.. సాధ్యమేనా?

Sudha Chandran

Sudha Chandran: సుధాచంద్రన్ కు ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. నృత్యకారిణిగా ఆమె కళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ ప్రమాదంలో కాలు కోల్పోయినా.. కృత్రిమ కాలుతో ఆమె ప్రదర్శనలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసి ఎన్నో అవార్డులను అందుకున్న గొప్ప కళాకారిణి ఆమె. ఆమె జీవితమే ఓ సినిమాగా ఆవిష్కృతమైతే.. ఆ సినిమాలో ఆమె పాత్రలో మయూరిగా ఆమె ఒదిగిన తీరు మరింత అభినందనీయం.

KGF 2: అటకెక్కిన ప్రమోషన్.. యష్ ఫ్యాన్స్‌లో నిరాశ!

ప్రస్తుతం బుల్లి తెర నటిగా.. భరతనాట్య కళాకారిణిగా దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇస్తున్న సుధాచంద్రన్ ప్రధాని మోదీకి ఓ విజ్ఞప్తి చేశారు. మన దేశంలో విమానాశ్రయాలలో ప్రయాణికులకు తనిఖీ ప్రక్రియ ఉంటుంది. పేలుడు పదార్ధాల డిటెక్టర్ (ETD) ద్వారా ఈ తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలో మెటల్ వస్తువులు ఏమైనా ప్రయాణికుల వద్ద ఉన్నా వారిని అనుమతించరు.

Priyanka Jawalkar: చూడచక్కని రూపం.. సొగసు మందారం!

సుధాచంద్రన్ కృత్రిమ కాలులో మెటల్ వస్తువులు కూడా ఉండడంతో ప్రతిసారి విమానాశ్రయాలలో సెక్యూరిటీతో ఆమెకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కృత్త్రిమ కాలును తొలగించి చెకింగ్ కు వెళ్లాలని సూచిస్తున్నారట. ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె ప్రశ్నించారు.

MAA Election: ‘మా’ ఎన్నికలలో వైసీపీ.. ఇవిగో సాక్ష్యాలు!

ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను” అంటూ ఆవేదనగా అభ్యర్థిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. నిజానికి ఇది ఒక సుధాచంద్రన్ ఒక్కరిదే కాదు.. వివిధ కారణాలతో శరీరంలో కృత్రిమ అవయవాలున్న అందరిదీ. మరి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి ఏమైనా పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి.