Sudheer Babu: సుధీర్ బాబు ‘హంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ సూరపనేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ అయ్యేలా చేసింది.

Sudheer Babu: సుధీర్ బాబు ‘హంట్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Sudheer Babu Hunt Movie Locks Release Date

Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ సూరపనేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ అయ్యేలా చేసింది.

Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..

కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ‘హంట్’ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ‘హంట్’ మూవీని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Sudheer Babu Hunt Teaser: సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్!

ఇక ఈ సినిమాలో ప్రేమిస్తే ఫేం భరత్, శ్రీకాంత్‌లు కూడా పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ తెలిపారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.