Sudheer Bbau : ఇంద్రగంటి గారితో నా కాంబినేషన్‌కి దిష్టి పెట్టారు.. ఉప్పెన కంటే ముందే కృతి ఈ సినిమా ఒప్పుకుంది..

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ, సినిమానే మనల్ని తీస్తుంది అని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నాకు సరిపోతుందేమో. ఇంద్రగంటి రాసుకున్న కథలే మమ్మల్ని...........

Sudheer Bbau : ఇంద్రగంటి గారితో నా కాంబినేషన్‌కి దిష్టి పెట్టారు.. ఉప్పెన కంటే ముందే కృతి ఈ సినిమా ఒప్పుకుంది..

Sudheer Babu spoke about a series of films with Indraganti Mohana Krishna

Sudheer Bbau :  హీరో సుధీర్ బాబు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫెరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకొని కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. తాజాగా నేడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇందులోకృతిశెట్టి హీరోయిన్ గా నటించగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే సుధీర్ బాబుకి డైరెక్టర్ ఇంద్రగంటితో ఇది మూడో సినిమా. ఇంద్రగంటి వరుసగా మూడు సినిమాలు సుధీర్ బాబుతోనే చేయడం విశేషం.

ఇంద్రగంటి-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఇప్పటివరకు సమ్మోహనం, వి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమాగా నేడు సెప్టెంబర్ 16న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. వరుసగా ఇంద్రగంటి గారితో సినిమాలు చేయడానికి కారణం ఏంటి అని అడగగా సుధీర్ బాబు ఆసక్తిగా సమాధానం చెప్పారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ, సినిమానే మనల్ని తీస్తుంది అని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నాకు సరిపోతుందేమో. ఇంద్రగంటి రాసుకున్న కథలే మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనుకుంటా. నన్ను నటుడిగా ఆయన నమ్మారు, ఆయన కథల్ని నేను నమ్ముతాను. మా కలయికలో వరుసగా సినిమాలు రావడానికి అదే కారణం. ఇప్పటికే మా కాంబినేషన్ కి చాలామంది దిష్టి పెట్టేశారు. ఇంద్రగంటి గారు ఆర్టిస్టులని దృష్టిలో పెట్టుకొని కథలు రాయరు. కథలు రాశాక దానికి తగ్గ ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన అందరి డైరెక్టర్స్ లాగా కమర్షియల్స్, మార్కెట్‌, ఫ్యాన్స్.. ఇలాంటి లెక్కలు ఏమి పట్టించుకోరు. ఆయన కథలకి తగ్గ హీరో నేను కావడం నా అదృష్టంగా భావిస్తానంతే” అని తెలిపారు.

Rashmika Mandanna : నా బాల్యం అంతా హాస్టల్ లోనే అయిపోయింది.. స్నేహితులే నా కుటుంబం.. ఎమోషనల్ అయిన రష్మిక..

”ఇటీవల నాకు ఇంద్రగంటి గారు ఇంకో కథ కూడా చెప్పారు. అది లేడీ ఓరియెంటెడ్ దాంట్లో హీరోగా చిన్న పాత్ర ఉంటుంది. జస్ట్ మాములుగా కథ చెప్పారు. కానీ అది నాతో తీస్తారో లేదో తెలీదు” అని సుధీర్ బాబు తెలిపారు.

ఇక హీరోయిన్ కృతి శెట్టి గురించి మాట్లాడుతూ.. ”తను చాలా హార్డవర్కర్. తన క్యారెక్టర్, సినిమా గురించి అంతా తెలుసుకొని నటిస్తుంది. కృతి ఈ సినిమాని ‘ఉప్పెన’ కంటే ముందే ఒప్పుకుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవడంతో ఈ లోపు కృతివి చాలా సినిమాలు వచ్చేశాయి. ఈ సినిమాలో చాలా బాగా నటించింది”అని అన్నారు.