Sudheer Babu: లాభాలు కురిపిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’!

టాలీవుడ్ లో కష్టపడి పనిచేస్తున్న హీరోలకు కొదువేలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడున్న కుర్ర హీరోలంతా సినిమాలకు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ప్రేక్షకులు కూడా కథలు, కంటెంట్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతుండడంతో మేకర్స్ కూడా ఆ విధంగానే కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

Sudheer Babu: లాభాలు కురిపిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’!

Sudheer Babu

Sudheer Babu: టాలీవుడ్ లో కష్టపడి పనిచేస్తున్న హీరోలకు కొదువేలేదు. ఆ మాటకొస్తే ఇప్పుడున్న కుర్ర హీరోలంతా సినిమాలకు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ప్రేక్షకులు కూడా కథలు, కంటెంట్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతుండడంతో మేకర్స్ కూడా ఆ విధంగానే కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లేకుండా భారీ వసూళ్లు రాబడుతుండడంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం భిన్నమైన కథల చుట్టూ తిరుగుతుంది.

స్వతహాగానే స్పోర్ట్స్ పర్సన్ అయిన సుధీర్ బాబు ఫిట్నెస్, సిక్స్ ప్యాక్ తో అదరగొట్టేస్తున్నాడు. అయితే.. చాలా కాలంగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ప‌లాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ క‌రుణ్ కుమార్ తో శ్రీదేవి సోడా సెంటర్ పేరుతో ఓ సినిమాను సిద్ధం చేశారు. పెద్దగా ప్రచారం లేకుండానే మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు నిర్మాతలకు లాభాలు కురిసిపిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని థియేటర్లకు రానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా భారీ బిజినెస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఓ ప్రముఖ టీవీ నెట్ వర్క్ రూ.9 కోట్లకు ద‌క్కించుకున్నట్టుగా సమాచారం. ఒకవిధంగా ఇది భారీ మొత్తం కాగా కేవలం హీరో, దర్శకుల మీద నమ్మకంతో ఈ బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు.