Sudheer Babu : అందుకే బ్రహ్మాస్త్ర సినిమా వదులుకున్నాను..

ఇటీవల ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వలో బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో పాటు మన కింగ్‌ నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర నటించారు ఇందులో. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకి.............

Sudheer Babu :  తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సుధీర్ బాబు. సెప్టెంబర్ 16న ఈ సినిమా రిలీజ్ అవ్వగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కొత్త కథ అవ్వడం, కథనం, ట్విస్టులు బాగుండటంతో సినిమాకి మంచి రీచ్ వస్తుంది. ఇక సినిమా ప్రమోషన్స్ తో ఇంకా బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు.

ఇటీవల ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వలో బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో పాటు మన కింగ్‌ నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర నటించారు ఇందులో. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకి సుధీర్ బాబుని అడిగారట. సుధీర్ బాబు దీనిపై స్పందిస్తూ.. బ్రహ్మాస్త్ర సినిమాలోని ఓ కీలక పాత్రకి సుధీర్ బాబుని అడిగారని, అయితే ఇక్కడ సినిమాలతో బిజీగా ఉంది డేట్లు ఖాళీ లేక బ్రహ్మాస్త్ర సినిమాని వదులుకున్నానని, అంతకు మించి ఏమి లేదని, బాలీవుడ్ నుంచి మళ్ళీ ఆఫర్స్ వచ్చి, నా డేట్స్ ఉంటే కచ్చితంగా చేస్తానని తెలిపాడు.

Amala Akkineni : నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి అందుకే సినిమాలు చేయట్లేదు..

సుధీర్ బాబు గతంలోనే టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన భాగీ చిత్రంలో విలన్‌గా నటించి బాలీవుడ్‌ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. మరి భవిష్యత్తులో ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు