Sridevi Soda Center : రూ.12కోట్లకు అమ్ముడైన సుధీర్ బాబు సినిమా

సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందిన సుధీర్ బాబు న‌టిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంట‌ర్. ఆనంది హీరోయిన్ గా

Sridevi Soda Center : రూ.12కోట్లకు అమ్ముడైన సుధీర్ బాబు సినిమా

Sridevi Soda Center

Sridevi Soda Center : సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందిన సుధీర్ బాబు న‌టిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంట‌ర్. ఆనంది హీరోయిన్ గా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రానికి అదిరిపోయే మార్కెట్ జ‌రుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 12 కోట్లకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఈ మధ్యే విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన జాతి రత్నాలు సినిమాను కూడా ఈయ‌నే డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళ్లింది. పోస్టర్లకు .. టీజర్ .. ట్రైలర్లకు .. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. హీరో లైటింగ్ చేసే సూరిబాబు పాత్రలో .. హీరోయిన్ సోడా సెంటర్ నడిపే శ్రీదేవి పాత్రలో సందడి చేయనున్నారు.

ఆనంది తెలుగు అమ్మాయినే .. తన కెరియర్ తొలినాళ్లలో ‘ఈ రోజుల్లో’ .. ‘ బస్టాప్’ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. అక్కడ యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ‘జాంబి రెడ్డి’తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేసింది.