లాక్ డౌన్ సమయంలో బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్న సుహానా ఖాన్

10TV Telugu News

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు తనకు నటన అంటే చాలా ఇష్టం అని మనకి తెలిసిన విషయం. కానీ, తనకు నటనతో పాటు బెల్లీ డాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఇప్పుడే తెలిసింది. 

ఈ లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అంతా తమ ఇళ్ళల్లో వంట నేర్చుకోవడం, పెయింటింగ్స్ వేయడంపై ఇంట్రెస్ట్ పెడుతుంటే… సుహానా మాత్రం ఆన్లైన్ లో బెల్లీ డాన్స్ నేర్చుకుంటుంది. 

ఈ సందర్భంగా బెల్లీ డాన్స్  టీచర్ సంజన ముత్రేజాతో కలిసి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లీ డాన్స్ ఒక్కటే కాదు మేకప్ ట్రైనర్ గా కూడా మారిపోయింది. తన మదర్ గౌరీ ఖాళీగా ఉన్న టైంలో తనకు మేకప్ క్లాసులు కూడా తీసుకుంటుంది.