Suhas : పోకిరి టికెట్ల కోసం చొక్కా చిరిగిపోయింది.. ఇప్పుడు నేనే చింపేసుకుంటా.. మహేష్ ట్వీట్‌కి సుహాస్ రిప్లై

సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్................

Suhas : పోకిరి టికెట్ల కోసం చొక్కా చిరిగిపోయింది.. ఇప్పుడు నేనే చింపేసుకుంటా.. మహేష్ ట్వీట్‌కి సుహాస్ రిప్లై

Suhas interesting reply tweet to mahesh babu tweet

Suhas :  షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు సంపాదించుకొని కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. ఆ సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా చాలా ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా సుహాస్ హీరోగా చేస్తున్న రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా అడివి శేష్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, శివ నిర్వాణ, హను రాఘవపూడి అతిధులుగా విచ్చేశారు. ఈ ట్రైలర్ చూసిన మహేష్ బాబు నిర్మాతలని, సుహాస్ ని, చిత్రయూనిట్ ని అభినందిస్తూ, ట్రైలర్ బాగుందంటూ ట్వీట్ చేశారు.

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

దీంతోసుహాస్ ఈ ట్వీట్ ని షేర్ చేసి.. అప్పుడు పోకిరి టికెట్లు కోసం విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసి నా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది. థ్యాంక్ యు సో మచ్ సర్.. హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఈ ట్వీట్ ని మరింత వైరల్ చేస్తూ సుహాస్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.