Suhas : ఆ సినిమా తరువాత నా భార్య నన్ను మూడు రోజుల ఇంటిలోకి రానివ్వలేదు.. సుహాస్!

టాలీవుడ్ లో తన నటనతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు 'సుహాస్'. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరకి పరిచయమైన ఈ యాక్టర్ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే ఈ నటుడు నటించిన ఒక సినిమా తరువాత తన భార్య మూడు రోజుల ఇంటిలోకి రానివ్వలేదట.

Suhas : ఆ సినిమా తరువాత నా భార్య నన్ను మూడు రోజుల ఇంటిలోకి రానివ్వలేదు.. సుహాస్!

suhas

Suhas : టాలీవుడ్ లో తన నటనతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు ‘సుహాస్’. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరకి పరిచయమైన ఈ యాక్టర్ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ.. నాగ చైతన్య ‘దోచేయ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Suhas : పోకిరి టికెట్ల కోసం చొక్కా చిరిగిపోయింది.. ఇప్పుడు నేనే చింపేసుకుంటా.. మహేష్ ట్వీట్‌కి సుహాస్ రిప్లై

ఇక 2020లో తానూ హీరోగా మారి చేసిన ‘కలర్ ఫోటో’ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు. ఇక ఈ సినిమా తరువాత అడపాదడపా హీరోగా కూడా నటిస్తూ వస్తున్నాడు. హీరో గానే కాదు విలన్ గా కూడా టాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. ఫ్యామిలీ డ్రామా, హిట్-2 వంటి సినిమాల్లో సైకో విలన్ గా కనిపించి అదరగొట్టాడు. అయితే ఫ్యామిలీ డ్రామా సినిమా చేసిన తరువాత సుహాస్ భార్య మూడు రోజుల పాటు ఇంటిలోకి రానివ్వలేదట.

తాజాగా ఈ నటుడు ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 3న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. లైఫ్ లో డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఫ్యామిలీ మెంబెర్స్ కి, ఫ్రెండ్స్ కి, ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని. ఆమెతో పెళ్లి తరువాత తన కెరీర్ ఉపందుకొంది అని తెలియజేశాడు.

కాగా ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో నన్ను సైకోగా చూసి నా భార్య బాగా భయపడింది. నన్ను ఇంటికి రావొద్దని, ఆఫీస్ లోనే పడుకోమని మూడు రోజులు పాటు ఇంటిలోకి రానివ్వలేదు. ఆ తరువాత కూడా నేను ఇంటిలో నార్మల్ గా నవ్వుతున్న భయపడేది అంటూ చెప్పుకొచ్చాడు.