Writer Padmabhushan : కలెక్షన్స్ తో అదరగొడుతున్న సుహాస్.. రైటర్ పద్మభూషణ్ లాభాల బాట..

న్న సినిమాగా రిలీజయి పెద్ద హిట్ గా దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధించింది. ఫ్యామిలీలతో కలిసి సరదాగా ఈ సినిమాకి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రైటర్ పద్మభూషణ్ డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్...............

Writer Padmabhushan : కలెక్షన్స్ తో అదరగొడుతున్న సుహాస్.. రైటర్ పద్మభూషణ్ లాభాల బాట..

Suhas Writer Padmabhushan Movie Collections

Writer Padmabhushan : షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి, యూట్యూబ్ లో ఫేమస్ అయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు సుహాస్. లాక్ డౌన్ సమయంలో కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి స్టార్ అయిపోయాడు. అంతకుముందే పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు. కలర్ ఫోటో సినిమా భారీ హిట్ అవ్వడం, ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయింది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో విడుదల కావాల్సి వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ట్రైలర్, సాంగ్స్ ముందే ప్రేక్షకులని మెప్పించి సినిమాపై అంచనాలు నెకొల్పేలా చేశాయి. రైటర్ పద్మభూషణ్ సినిమా అంచనాలు అందుకొని డీసెంట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది.

YRF SPY UNIVERSE : YRF స్పై యూనివర్స్.. బాలీవుడ్ లో గట్టిగా ప్లాన్ చేస్తోన్న యశ్ రాజ్ ఫిలిమ్స్..

చిన్న సినిమాగా రిలీజయి పెద్ద హిట్ గా దూసుకుపోతుంది రైటర్ పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా మంచి విజయం సాధించింది. ఫ్యామిలీలతో కలిసి సరదాగా ఈ సినిమాకి వస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రైటర్ పద్మభూషణ్ డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. మొదటిరోజు ఈ సినిమా 1.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. రెండో రోజు అంతకంటే డబల్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది రైటర్ పద్మభూషణ్ సినిమా. రెండు రోజుల్లో రైటర్ పద్మభూషణ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అయితే 175k డాలర్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక నేడు ఆదివారం కావడంతో కచ్చితంగా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 3 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఇప్పటికే 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే దాదాపు 2 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇక ఆదివారం కూడా డబల్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండటంతో సినిమా లాభాల బాట పట్టింది. ఫుల్ రన్ లో ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ దక్కించుకుంటుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.