Writer Padmabhushan : 10 కోట్ల రైటర్ పద్మభూషణ్.. లాభాలే లాభాలు.. సూపర్ ఫామ్ లో ఉన్న సుహాస్..

సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు. రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది.................

Writer Padmabhushan : 10 కోట్ల రైటర్ పద్మభూషణ్.. లాభాలే లాభాలు.. సూపర్ ఫామ్ లో ఉన్న సుహాస్..

Suhas Writer Padmabhushan movie collects 10 crores gross in 10 days with supar hit talk

Writer Padmabhushan :  షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి పేరు సంపాదించుకొని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఈ సినిమా అనంతరం సుహాస్ కి భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఇక సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు.

రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. కామెడీ, ఎమోషనల్, అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేశారు చిత్రయూనిట్. సినిమాకి ఆదరణ పెంచడానికి ఉమెన్స్ కి స్పెషల్ గా ఒక రోజంతా పలు థియేటర్స్ లో ఫ్రీ షోలు వేశారు. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

Nijam with Smitha : నిజం విత్ స్మిత.. చంద్రబాబుతో రెండో ఎపిసోడ్.. ప్రోమో రిలీజ్.. ఏపీలో మళ్ళీ పొలిటికల్ రచ్చ ఖాయం..

చాలా తక్కువ కాస్ట్, తక్కువ లొకేషన్స్, తక్కువ టైంలో, ఒక 10 మంది తప్పితే మిగిలిన వాళ్లంతా చిన్న చిన్న ఆర్టిస్టులతోనే ఈ సినిమాని తీయడంతో కేవలం 2-3 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి వారంలోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళింది. తాజాగా రైటర్ పద్మభూషణ్ సినిమా 10 రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. ఇక అమెరికాలో కూడా 300K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసింది. మరో మూడు రోజుల వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమాకి లాభాలతో పాటు హీరో సుహాస్ కి హిట్ 2 లో విలన్ గా, రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడటంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సుహాస్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాక విలన్ గా, హీరోగా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు.