Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ రివ్యూ.. అమ్మకోసం.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయింది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో విడుదల కావాల్సి వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ముందు నుంచి ఈ సినిమాపై............

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ రివ్యూ.. అమ్మకోసం.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

Suhas Writer Padmabhushan Movie Review

Writer Padmabhushan :  షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి, యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు సుహాస్. లాక్ డౌన్ సమయంలో కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి స్టార్ అయిపోయాడు. అంతకుముందే పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు. కలర్ ఫోటో సినిమా భారీ హిట్ అవ్వడం, ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

తాజాగా సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయింది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో విడుదల కావాల్సి వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో సుహాస్ కి హీరోగా ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సుహాస్ మంచి కథలు అందిస్తాడు అని సుహాస్ వల్లే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులని మెప్పించాయి. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక డీసెంట్ టాక్ తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పిస్తుంది.

కథ విషయానికి వస్తే.. పుస్తకాలు అనే పిచ్చి ఉన్న ఓ యువకుడు అసిస్టెంట్ లైబ్రరియన్ గా జాబ్ చేస్తూ ఎప్పటికైనా రైటర్ కావాలని కలలు కంటూ ఓ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు. కానీ ఆ పుస్తకం ఎవ్వరూ కొనరు. దీంతో చాలా నిరుత్సాహపడతాడు. అలాంటి టైంలో సుహాస్ బంధువులు సుహాస్ పెద్ద రైటర్ అని, తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తామని ప్రకటిస్తారు. మొదట సుహాస్ ఆశ్చర్యపోతాడు. హీరోయిన్ సుహాస్ కి తాను చదివిన బుక్ తీసుకొచ్చు నువ్వు రాసిన బుక్ బాగుంది అని చెప్తుంది. ఆ బుక్ తాను రాయడు, కానీ తన పేరు, ఫొటోతో ఎవరో రిలీజ్ చేశారు. మొదట తప్పు అనిపించినా పరిస్థితులు అన్నీ తనకి అనుకూలంగా మారడంతో ఆ బుక్ రైటర్ తానే అని చెప్పుకొని తిరుగుతూ కాబోయే భార్యతో ప్రేమాయణం నడిపిస్తాడు. తన పేరుతో ఆ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళే ఓ బ్లాగ్ కూడా నడుపుతూ మధ్యలో కంటెంట్ ఆపేయడంతో తనకి టెన్షన్ మొదలయి అసలు ఆ బుక్ ఎవరు రాశారు అని వెతకడం మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కి నిజం చెప్పగా మొదట ఛీ కొట్టినా తర్వాత అర్ధం చేసుకొని, తాను కూడా సుహాస్ ని ప్రేమించడంతో ఆ బుక్ ఎవరు రాశారో కనుక్కోవడంలో సహాయం చేస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ బుక్ ఎవరు రాశారో కనుక్కోవడం గురించి, ఆ బుక్ తాను రాయలేదని ఇంట్లో తెలియడం, చివరికి సుహాస్ నిజంగానే బుక్ రాశాడా? ఆ బుక్ రాసింది ఎవరు అని సాగుతుంది.

మొదటి హాఫ్ అంతా కామెడీతో సాగినా రెండో సగం మాత్రం ఎమోషనల్ గా తీసుకువెళ్లాడు దర్శకుడు. అయితే సినిమాలో ట్విస్ట్ ఉందని భావించినా సెకండ్ హాఫ్ మొదట్లోనే మినిమమ్ సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళంతా ఆ బుక్ రాసింది ఎవరో కనిపెట్టేస్తారు. దర్శకుడు పెట్టిన కొన్ని సీన్స్ తో ఇది ఎవరికైనా అర్థం అయిపోతుంది. దీంతో ఆ ట్విస్ట్ అంతగా క్లిక్ అవ్వకపోయినా సినిమాని ఎమోషనల్ గా నడిపించాడు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సినిమాలో అమ్మ సెంటిమెంట్ ని బాగా ఉపయోగించాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది కళ్ళకి కట్టినట్టు చూపించాడు. అయితే దర్శకుడు తీసుకున్న పాయింట్ 1990, 2000 సంవత్సరాలలో అయితే బాగుండేది. దర్శకుడు చూపించిన సన్నివేశాలు ఇప్పుడు అంతగా లేవు. అందుకే దానికి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరేమో అని అమ్మ సెంటిమెంట్ ని జోడించినట్టు ఉంటుంది.

సుహాస్ గురించి అందరికి తెలిసిందే. హీరోగా సుహాస్ అద్భుతమైన నటనని ఇచ్చాడు. ఇక అమ్మగా రోహిణి, నాన్నగా ఆశిష్ విద్యార్ధి చాలా బాగా నటించారు. హీరోయిన్ టీనా శిల్పారాజ్ కూడా ప్రేక్షకులని మెప్పించింది. మరో క్యారెక్టర్ గౌరి ప్రియా కూడా పర్వాలేదనిపించింది. సుహాస్ ఫ్రెండ్ గా ప్రవీణ్ కఠారి కూడా మెప్పిస్తాడు. ఇక సినిమా మొత్తం చాలా వరకు విజయవాడలోనే తీయడంతో విజయవాడ ప్రజలు సినిమాకి మరింత కనెక్ట్ అవుతారు. సుహాస్ విజయవాడ అబ్బాయి కావడంతో సినిమాతో పాటు విజయవాడని కూడా బాగా ప్రమోట్ చేశారు. కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారు. సినిమా రిలీజ్ కి ముందే కన్నుల్లో నీ రూపమే అనే సినిమా చాలా మందిని మెప్పించింది.

Vijay Devarakonda : మొత్తానికి బయటకొచ్చిన రౌడీ స్టార్.. ఆగిపోయిన ఖుషి పనులు మొదలు..

మొత్తంగా రైటర్ పద్మభూషణ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీలతో కలిసి సరదాగా ఈ సినిమాకి వెళ్లొచ్చు. రైటర్ పద్మభూషణ్ డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఈ సినిమా 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆదివారం కూడా ఉండటంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.