Jacqueline Fernandez: జాక్వెలిన్‌తో రూ.500కోట్లు పెట్టి సూపర్ హీరో సినిమా తీస్తానన్న సుఖేశ్

బాలీవుడ్ న‌టిగా కంటే సుఖేశ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ గానే హైలెట్ అవుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమెతో రూ. 500కోట్ల విలువైన సూపర్ హీరో సినిమా తీస్తానని కూడా ప్రామిస్ చేశాడట సుఖేశ్

Jacqueline Fernandez: జాక్వెలిన్‌తో రూ.500కోట్లు పెట్టి సూపర్ హీరో సినిమా తీస్తానన్న సుఖేశ్

Jacqueline Fernandez

Jacqueline Fernandez: బాలీవుడ్ న‌టిగా కంటే సుఖేశ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ గానే హైలెట్ అవుతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమెతో రూ. 500కోట్ల విలువైన సూపర్ హీరో సినిమా తీస్తానని కూడా ప్రామిస్ చేశాడట సుఖేశ్. భార‌త్‌లోనే తొలి మ‌హిళా సూప‌ర్ హీరో ప్రాజెక్ట్‌ను తీస్తానని, హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు సైతం మన సినిమా కోసం ప‌నిచేస్తార‌ని చెప్పడంతో నమ్మేసింది.

హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీతో పోల్చి మూడు పార్టులుగా సినిమా తీస్తానని చెప్పాడట.

‘బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకున్న జాక్వెలిన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు సుఖేశ్. అంతేకాకుండా ఆమెను లోబరుచుకుని ఎక్కువ సినిమాలకు సైన్ చేయకుండా చేశాడు. సూపర్ హీరో సినిమా తీసి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో పనిచేయించి.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని చెప్పాడు’ అని ఇంగ్లీష్ మీడియా ప్రచురించింది.

…………………………………….: కట్టు జారిపోతా ఉంది హొయ్.. చీరకట్టు జారిపోతా ఉంది!

సినిమా బడ్జెట్ల గురించి, ప్రొడక్షన్, ఇండస్ట్రీలో ఫేమ్ కోల్పోయిన వ్యక్తులపై రీసెర్చ్ చేసి.. కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు సుఖేశ్ తాను.. అమెరికాలో ఉంటున్న జాక్వెలిన్ చెల్లెకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పానని చెప్తుంటే అలాంటిదేం లేదని కొట్టిపారేస్తుందట జాక్వెలిన్. అంతేకాకుండా బెంజ్ కార్లు లాంటి కాస్ట్లీ గిఫ్టులు కూడా చాలా ఇచ్చానని చెప్తున్నాడు సుఖేశ్.

సుఖేశ్ తీహార్ జైలులో ఉన్న‌ప్పుడు జాక్వెలిన్ త‌రుచూ అత‌డిని క‌ల‌వ‌డానికి జైలుకు కూడా వెళ్లేద‌ని తెలుస్తోంది. జాక్వెలిన్‌కు కూడా ఈడీ స‌మ‌న్లు జారీ చేసి త‌న‌ను విచారించ‌గా సుఖేశ్ త‌న‌కు 1,50,000 డాల‌ర్లు మాత్ర‌మే పంపించాడ‌ని వెల్లడించింది. ఇలాంటి ఆర్థిక నేరాలు సుఖేశ్ ఎన్నో పాల్ప‌డిన‌ట్టు ఈడీ విచార‌ణ‌లో వెల్లడైంది.

………………………………….. : చిన్నపిల్లలో వ్యాయామం…ఆరోగ్యానికి శ్రేయస్కరమే!..