Sukumar – Fahadh: సుకుమార్‌తో సినిమా చేయాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాం – ఫహద్ ఫాసిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు పార్ట్ లుగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ లీడ్ ప్రత్యర్థి పాత్ర పోషించారు.

Sukumar – Fahadh: సుకుమార్‌తో సినిమా చేయాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాం – ఫహద్ ఫాసిల్

Sukumar Fahadh

Sukumar – Fahadh: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు పార్ట్ లుగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ లీడ్ ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమాలో తాను యాక్ట్ చేయడం వెనుక సుకుమార్ తో తనకున్న పరిచయం, కారణాలు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వివరించాడు ఫహద్ ఫాసిల్.

తెలుగు ఎంట్రీ కంటే ముందుగానే తమిళ సినిమాల్లో కనిపించిన ఫహద్.. పుష్షలో కీలకమైన పాత్రతో కనిపించనున్నాడు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సినిమాలో భాగం అయినందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నానని చెప్తూ.. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనున్నట్లు కన్ఫామ్ చేశాడు.

‘టీమ్ తో జాయిన్ అవడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. సుకుమార్ గత సినిమాలన్నీ చూశాను. చాలా కాలంగా కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి పుష్షతో కుదరడంతో చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు.

పుష్పలో ఫహద్ ఫాసిల్ కనిపించనున్నాడనే అనౌన్స్‌మెంట్ బిగ్ సర్‌ప్రైజ్‌గా, షాకింగ్‌గా మారింది. ఎందుకంటే ఈ మళయాళీ యాక్టర్ సినిమాలను సెలక్టివ్ గా ఎంచుకుంటాడు కాబట్టి. అల్లు అర్జున్ కు కేరళలో ఉన్న క్రేజ్ తో పాటు ఫహద్ కూడా తోడైతే సినిమా పెద్ద హిట్ అవుతుందని సినిమా యూనిట్ భావిస్తుంది.

రష్మిక మంధాన, సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రాజెక్టులో మిగిలిన కీలక రోల్స్ లో కనిపించనున్నారు. సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా రెడీ అవుతుంది.