Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?

ముందుగా అనుకున్న క‌థ‌లో కొన్ని మార్పుల‌కు తోడు.. కొత్త ఆక‌ర్ష‌ణ‌లు కూడా జోడించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ట‌. ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల పెళ్లితో ఎండ్ కాగా రెండో భాగంలో కూడా కథానాయికగా రష్మికనే ఉంటుంది.

Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?

Pushpa 2

Pushpa 2: పుష్ప.. పుష్పరాజ్.. దీనెవ్వ తగ్గేదేలే.. సౌత్ టూ నార్త్ ఈ డైలాగ్ ఎంతగా ప్రేక్షకుల మెదళ్ళకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అంచనాలను మించి పుష్ప బ్లాక్‌బ‌స్ట‌ర్ స్టేట‌స్ అందుకుని అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన ఈ సినిమా.. ముఖ్యంగా హిందీలో రాబట్టిన కలెక్షన్లు అక్కడి ట్రేడ్ పండిట్ల‌కు పెద్ద షాక్. రిలీజ్ త‌ర్వాత కూడా పుష్ప క్రేజ్ అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టం విశేషం కాగా.. ఇప్పుడు అందరి చూపు పుష్ప 2 ఎలా ఉండబోతుందన్న దానిపై పడింది.

Pushpa 2: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2

పుష్ప 2 మీద నెలకొన్న భారీ అంచ‌నాల‌ను అందుకోవ‌డానికి ఇప్పుడు సుకుమార్ గ‌ట్టి క‌స‌ర‌త్తే చేస్తున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వంగా ఫిబ్ర‌వ‌రిలోనే షూటింగ్ అనుకున్న‌ప్ప‌టికీ.. సెకండ్ పార్ట్ స్క్రిప్టు మీద మ‌రింత వ‌ర్క్ చేస్తుండ‌టం వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్లు ప్రచారం జరుగుతుంది. ముందుగా అనుకున్న క‌థ‌లో కొన్ని మార్పుల‌కు తోడు.. కొత్త ఆక‌ర్ష‌ణ‌లు కూడా జోడించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ట‌. ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల పెళ్లితో ఎండ్ కాగా రెండో భాగంలో కూడా కథానాయికగా రష్మికనే ఉంటుంది.

Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

అయితే రెండో పార్ట్ లో సెకండ్ హీరోయిన్ కి కూడా చోటు ఇస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ తోను పుష్ప రొమాన్స్ ఉంటుందని.. ప్రస్తుతం ఆ కథానాయిక ఎంపిక జరుగుతుందని టాక్ నడుస్తుంది. ఇక స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానీని దింపుతున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఎలాగూ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, బడ్జెట్ కూడా అంతే స్థాయిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక సినిమా కూడా ఆ స్థాయిలో ఉండనుందని.. స్మగ్లింగ్ మాఫియాలో పుష్ప రాజ్ ఆట ఎలా ఉంటుందో ఊహకి అందని విధంగా సుక్కూ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.