Akashay Kumar : సుకుమార్‌కి బాలీవుడ్ ఆఫర్.. ఫోన్ చేసి మరీ సినిమా చేద్దామన్న స్టార్ హీరో

ఇటీవల సుకుమార్ 'పుష్ప' సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు. సుకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే బాలీవుడ్ లో స్ట్రెయిట్ హిందీ మూవీని చేయాలనే......

10TV Telugu News

Sukumar :  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకప్పుడు లవ్ సినిమాలు చేస్తూ ఆ తర్వాత మెల్లి మెల్లిగా మాస్ కి మారి ఇప్పుడు ఊర మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే అల్లుఅర్జున్ తో ‘పుష్ప’ సినిమాని రిలీజ్ చేసి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించాడు. ఈ సినిమాకి అల్లుఅర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ కి కూడా అన్ని పరిశ్రమల నుంచి ప్రశంశలు అందుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘పుష్ప పార్ట్ 2’, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో, ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు ఉన్నాయి సుకుమార్ కి. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కిస్తున్నారు.

Roja : జగన్‌ – చిరు భేటీ‌పై స్పందించిన రోజా

ఇటీవల సుకుమార్ ‘పుష్ప’ సక్సెస్ తర్వాత బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు. సుకుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే బాలీవుడ్ లో స్ట్రెయిట్ హిందీ మూవీని చేయాలనే ఆలోచనలో ఉన్నాను. `పుష్ప` చిత్రీకరణ సమయంలో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్ నాకు ఫోన్ చేశారు. అక్షయ్ నాకు ఫోన్ చేసి నువ్వు నాతో కలిసి పని చేయాలి ముంబైకి రా” అని తనకు ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. అక్షయ్ కి తగిన స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా అక్షయ్ కుమార్ తో సినిమా చేస్తానని సుకుమార్ తెలిపారు. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో సుకుమార్ కి వరుస బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. దీంతో సుకుమార్ కూడా బాలీవుడ్ లో త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

×