Sukumar : ఈ కుర్చీ మీ కోసమే రాజమౌళి సార్.. సుకుమార్ స్పెషల్ పోస్ట్..

రాజమౌళిని అభిమానించే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆర్య కథలతో మొదలుపెట్టి పుష్ప లాంటి మాస్ సినిమాతో దేశమంతటా హిట్ కొట్టాడు సుక్కు. సుకుమార్ గతంలో చాలా సార్లు రాజమౌళిని అభిమానించే విషయాన్ని తెలిపాడు. తాజాగా RRR సినిమా నుంచి.....................

Sukumar : ఈ కుర్చీ మీ కోసమే రాజమౌళి సార్.. సుకుమార్ స్పెషల్ పోస్ట్..

Sukumar special post on Rajamouli goes viral

Sukumar :  బాహుబలితో దేశమంతటా పాపులర్ అయిన రాజమౌళి RRR సినిమాతో ప్రపంచాన్ని మెప్పించారు. RRR సినిమా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని రకాల సినిమా ప్రేక్షకులని, టెక్నీషియన్స్ ని మెప్పించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న RRR సినిమా ఇటీవలే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. దీంతో అంతా రాజమౌళిని, కీరవాణిని చిత్రయూనిట్ ని వాళ్లకి తగినట్లుగా అభినందిస్తున్నారు.

రాజమౌళిని అభిమానించే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆర్య కథలతో మొదలుపెట్టి పుష్ప లాంటి మాస్ సినిమాతో దేశమంతటా హిట్ కొట్టాడు సుక్కు. సుకుమార్ గతంలో చాలా సార్లు రాజమౌళిని అభిమానించే విషయాన్ని తెలిపాడు. తాజాగా RRR సినిమా నుంచి నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకోవడంతో సుకుమార్ తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేశాడు.

SV Rangarao Grand Sons : బాలకృష్ణ ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. బాలయ్యని సపోర్ట్ చేసిన ఎస్వీ రంగారావు మనవళ్లు..

తన రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూర్చొని ఉన్న ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు సుకుమార్. ఈ ఫొటోలో అందరూ కూర్చొని ఉండగా ఎదురుగా ఓ పెద్ద చైర్ ఖాళీగా ఉంది. ఈ ఫొటోని షేర్ చేసి.. నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నింటిలో అసంకల్పితంగా ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేశాను. కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నాను. రాజమౌళి సార్ ఇది మీకోసమే. ఈ కుర్చీ ఎప్పుడూ మీకోసమే ఉంటుంది. ఇది మీకు చెందింది. భవిష్యత్తులో కూడా ఆ కుర్చీ అలాగే ఉంటుంది అని తెలిపారు. దీంతో అంతా సుకుమార్ ని అభినందిస్తున్నారు. రాజమౌళి అభిమానులు ఈ పోస్ట్ ని తెగ షేర్ చేసేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sukumar B (@aryasukku)