Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..? | Sukumar Taking Pushpa2 To Big

Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్...

Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్టు పనులపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇక షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Pushpa2: పుష్ప-2లో మరో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే?

అయితే ఈ సినిమా కోసం సుకుమార్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈ సినిమాను తొలిభాగం కంటే కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. అంతేగాక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత పాపులర్ చేసేందుకు ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు అగ్ర నటీనటులను ఈ సినిమాలో తీసుకునేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పుష్ప సినిమా కేవలం దక్షిణాదినే కానకుండా ఉత్తరాదిన కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందని ఆయన భావిస్తున్నాడు.

Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను కట్టిపడేయగా, ఆయన ఈ సినిమాలో తగ్గేదే లే.. అంటూ చేసిన మేనరిజం ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతూ ఇంకా ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

×