Vijay Devarakonda: రౌడీ హీరోతో సుకుమార్.. ఆర్యకి సీక్వెల్?

క్రేజీ డైరెక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ కలిసి సినిమా చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అసలువీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుబోయే సినిమా..

Vijay Devarakonda: రౌడీ హీరోతో సుకుమార్.. ఆర్యకి సీక్వెల్?

Vijay Devarakonda

Vijay Devarakonda: క్రేజీ డైరెక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ కలిసి సినిమా చేస్తున్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు. సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అసలువీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుబోయే సినిమా కాన్సెప్ట్ ఏంటి..? కథేంటి..? ఏ జానర్ లో ఉండబోతోంది అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ మూవీకి సీక్వెల్ గా రాబోతోందంటూ క్రేజ్ టాక్ వినిపిస్తోంది.

Nikita Sharma: హృదయాలకు గాయం చేస్తున్న ఢిల్లీ సోయగం!

ఫీల్ మై లవ్ అంటూ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని కట్టిపడేసిన ఆర్య మూవీ బన్నీ కెరీర్ లో సూపర్ హిట్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. సుకుమార్ కి సక్సెస్ తో పాటు, బన్నీకి కూడా మైల్ స్టోన్ మూవీ అయ్యింది. అందుకే ఆ సినిమా కి సీక్వెల్ గా ఆర్య 2 తీసి మళ్లీ ఐకానిక్ సక్సెస్ అందుకున్నారు ఈ కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమాకి మరో సీక్వెల్ ఆర్య 3 ని విజయ్ హీరోగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు టీమ్ .

Pooja Hegde: నేను తెలుగమ్మాయినే.. అలా పిలిస్తేనే ఇష్టం!

విజయ్ -సుకుమార్ కాంబినేషన్లో ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేసిన ఫాల్కన్ మేకర్స్..ఈ కాంబినేషన్లో సినిమా గ్యారంటీగా ఉంటుందని ఈ సినిమాకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. కొత్త కథే అయినా విజయ్ కి ఆర్య కాన్సెప్ట్ ని యాడ్ చేసి ఆడియన్స్ లో క్రేజ్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారట సుకుమార్. లవర్ బాయ్ గా యూత్ లో విజయ్ కి పీక్స్ లో క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డితో పాటు చాలా సినిమాల్లో తన యూత్ ఫాలోయింగ్ ని చూపించారు విజయ్.

Akshay Kumar: అక్కీ ఏం చేసినా ట్రెండే.. బయోపిక్స్‌కా బాద్ షా!

అలాంటిది బన్నీ క్యారెక్టర్ ని విజయ్ రీక్రియేట్ చెయ్యడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఫాన్స్. అందుకే ఆర్య 3ని విజయ్ తో ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ బన్నీకున్న ఈజ్ , క్రేజ్ విజయ్ కూడా సంపాదించుకున్నాడు కాబట్టి.. తన ఆర్య సినిమాకి సీక్వెల్ గా విజయ్ యాక్ట్ చేస్తే బన్నీ కూడా ఫుల్ హ్యాపీ ఫీలవుతాడంటున్నారు ఫాన్స్.