Suma Kanakala : యాంకర్ సుమకి షూటింగ్‌లో తప్పిన ప్రమాదం..

తాజాగా సుమ తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. జయమ్మ పంచాయితీ షూటింగ్ టైంలో ఓ అడవిలో షూటింగ్ చేస్తుండగా అక్కడ నీటి ప్రవాహం వద్ద....................

Suma Kanakala : యాంకర్ సుమకి షూటింగ్‌లో తప్పిన ప్రమాదం..

Suma

 

Suma :  బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్ సుమ ఇటీవల మెయిన్ లీడ్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మే 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కోసం సుమ వీర లెవల్లో ప్రమోషన్స్ చేసింది. ఈ సినిమా కోసం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలు అంతా వచ్చి ప్రమోట్ చేశారు సుమ కోసం.

Hero Yash: ఆచితూచి అడుగేస్తున్న యష్.. ప్రభాస్ నుండి రాఖీ భాయ్ గుణపాఠం!

తాజాగా సుమ తన సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. జయమ్మ పంచాయితీ షూటింగ్ టైంలో ఓ అడవిలో షూటింగ్ చేస్తుండగా అక్కడ నీటి ప్రవాహం వద్ద నిలబడి ఉంది. సుమ నిలబడి ఉన్న ఆ రాళ్లు పీచు పట్టి ఉండటంతో సుమ అనుకోకుండా జారి పడింది. వెంటనే చిత్ర యూనిట్ స్పందించి సుమని పట్టుకొని పైకి లేపారు. ఈ వీడియో పోస్ట్ చేసి కొద్దిలో నాకు ప్రమాదం తప్పింది షూటింగ్ టైంలో అంటూ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వగా నెటిజన్లు జాగ్రత్త సుమక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)