భర్తతో క్యూట్ పిక్ షేర్ చేసిన సుమ..

10TV Telugu News

Suma Kanakala shared a cute photo: తన భర్త రాజీవ్ కనకాల గురించి స్టార్ యాంకర్ సుమ చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ట్వీట్‌లో భర్తపై తనకున్న ప్రేమాభిమానాలను ఒక్క ముక్కలో ఆమె చాలా స్పష్టంగా వెల్లడించారు.


‘మై డియర్ రాజా… ఎప్పటికీ నా సంతోషం నువ్వే’ అని ఆమె ట్వీట్ చేశారు. తన భర్త చేతిని పట్టుకుని, ఆయన భుజంపై తలవాల్చిన ఫొటోను షేర్ చేశారు సుమ.https://10tv.in/samantha-akkineni-supports-to-sara-ali-khan-and-rakul-preet-singh/
ఇటీవల సుమ హోస్ట్ చేస్తున్నఓ షోకి రాజీవ్ వెళ్లారు.. వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉందనేది ఆ ప్రోమోలో చూస్తే అర్థమవుతోంది. సుమ కంటతడిపెట్టుకుని రాజీవ్‌ను హత్తుకోవడం.. రాజీవ్ సుమ కన్నీళ్లు తుడుస్తూ ఆమెను ఓదార్చడం.. ఇలా వారి ప్రేమను తెలుపుతూ ఎమోషనల్‌గా సాగే ప్రోమో ఆకట్టుకుంటోంది. సుమ టీవీ షోలతో బిజీగా ఉండగా రాజీవ్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.