Suman : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ హ్యాపీగా లేరు.. బయ్యర్స్ గురించి పట్టించుకోవట్లేదు..

సుమన్ మాట్లాడుతూ.. ''దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారు. ముఖ్యంగా ఆయన బయ్యర్స్‌ గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్‌ అయితే............

Suman : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ హ్యాపీగా లేరు.. బయ్యర్స్ గురించి పట్టించుకోవట్లేదు..

Suman

Suman :  సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. దాసరికి నివాళులు అర్పించి, ఆయనను తలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన గురించి పలువురు ప్రముఖులు మాట్లాడారు. టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సుమన్ మాట్లాడుతూ.. ”దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారు. ముఖ్యంగా ఆయన బయ్యర్స్‌ గురించి ఎక్కువగా ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్‌ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు అసలు బయ్యర్స్‌ గురించి ఆలోచించట్లేదు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవ్వరూ హ్యాపీగా లేరు. మేకర్స్ నిర్ణయాల వల్ల బయ్యర్స్‌ నష్టపోతున్నారు. బయ్యర్స్‌ అసలు సంతోషంగా ఉండట్లేదు.

TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు మేకర్స్. అవి హిట్ అవుతాయనే నమ్మకంతో బయ్యర్స్‌ కొంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. అంతేకాదు సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగించేలా ఇప్పటి మేకర్స్, నటీనటులు ఉన్నారు. నేను ఇదేమి ఆవేశంతో మాట్లాడట్లేదు. ఇది పచ్చి నిజం” అని ఆవేశంగా మాట్లాడారు. దీంతో సుమన్ మాట్లాడిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి.