దీపికతో సుమంత్ అశ్విన్ పెళ్లి..

దీపికతో సుమంత్ అశ్విన్ పెళ్లి..

Sumanth Ashwin:టాలీవుడ్‌లో వెడ్డింగ్ బెల్స్ కంటిన్యూ అవుతున్నాయి. రానా, నితిన్, నిహారిక కొణిదెల ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ నిర్మాత, దర్శకుడు, సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్..

దీపిక అనే అమ్మాయితో సుమంత్ వివాహం ఈ నెల 13న జరుగబోతోంది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమకు చెందిన కేవలం పది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారట. సుమంత్ పెళ్లి వార్తను సోషల్ మీడియా ద్వారా ఎమ్.ఎస్.రాజు ప్రకటించారు.

తండ్రి డైరెక్ట్ చేసిన ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఆ తర్వాత పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌లతో కలిసి ‘ఇది మా కథ’ అనే మూవీ చేస్తున్నాడు.