ఒక జంట ప్రేమలో.. మరో జంట ప్రొడక్షన్‌లో..

బాలీవుడ్ జంట ఏక్తా కౌల్, సుమీత్ వ్యాస్ అలాగే ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా సర్‌ప్రైజ్ న్యూస్ షేర్ చేశారు..

  • Published By: sekhar ,Published On : April 6, 2020 / 12:12 PM IST
ఒక జంట ప్రేమలో.. మరో జంట ప్రొడక్షన్‌లో..

బాలీవుడ్ జంట ఏక్తా కౌల్, సుమీత్ వ్యాస్ అలాగే ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా సర్‌ప్రైజ్ న్యూస్ షేర్ చేశారు..

ఓ జంట త్వరలో తాము పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నామని తెలియచేయగా.. మరో జంట తాము డేటింగ్‌లో ఉన్నామని కన్ఫామ్ చేశారు.  మోడల్‌, టీవీ నటి ఏక్తా కౌల్‌, బాలీవుడ్‌ నటుడు, రచయిత సుమీత్‌ వ్యాస్‌ను ప్రేమించారు. 2018లో వీరిద్దరు కశ్మీరీ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఏక్తా గర్భిణీ. 
‘‘మేమిద్దరం కలిసి ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. త్వరలోనే జూనియర్‌ కౌల్‌వ్యాస్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు సృష్టికర్త, డైరెక్టర్లు, నిర్మాతలు సుమీత్‌ వ్యాస్‌, నేను’’.. అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. తన భర్త తనను ఆత్మీయంగా హత్తుకున్న ఫోటో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

Sumeet Vyas and Ekta Kaul announce pregnancy

హిందీ ‘బిగ్‌బాస్‌ 11’ కంటెస్టెంట్స్‌ ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా వారి రిలేషన్‌షిప్‌ను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. రెండేళ్లు నుంచి సిక్రేట్‌గా డేట్ చేస్తున్న ఈ జంట వారి ప్రేమను అధికారంగా వెల్లడించారు.  ప్రియాంక్‌ వారిద్దరూ సన్నిహితం ఉన్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘అవును ప్రేమలో ఉన్నాం’ అనే క్యాప్షన్‌కు హార్ట్‌ ఎమోజీని యాడ్ చేయగా.. బెనాఫ్‌షా కూడా అదే చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మా ప్రేమను అందరిలాంటి ప్రేమలా చూడకండి. ఎందుకంటే నాది అసాధారణమైన ప్రేమ’ అని వర్ణించిందామె.
కాగా వారిద్దరి పోస్టుకు ‘‘ఫైనల్లీ’’ అంటూ నటి హినా ఖాన్‌ బాయ్‌ఫ్రేండ్‌ కామెంట్‌ చేయగా.. కరణ్‌ వాహీ ‘‘మీ ఇద్దరికి పిచ్చి’’ అంటూ కామెంట్‌ చేశాడు.

Bigg Boss 11's Priyank Sharma Confirms Dating Benafsha Soonawalla

బిగ్‌బాస్‌ హౌజ్‌లో సన్నిహితంగా మెలిగిన ఈ జంట బయటకు వచ్చాక కూడా చెట్టపట్టాలేసుకు తిరుగుతూ ప్రేమయాణం సాగించారు. అయితే వారి ప్రేమపై ప్రశ్నించినప్పుడల్లా.. అందరిలానే.. ‘మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ‘బిగ్ బాస్ 11’లో పార్టిసిపెట్ చేయడానికి ముందు బెనాఫ్‌షా, నటుడు వరుణ్ సూద్‌తో డేటింగ్ చేసింది. ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే వరుణ్‌కు బ్రేకప్‌ చెప్పి ఈ భామ ప్రియాంక్‌తో రిలేషన్ స్టార్ట్ చేసింది. అదన్నమాట సంగతి..

View this post on Instagram

Confirmation ❤️

A post shared by Priyank Sharma (@priyanksharmaaa) on

Read Also : ప్రభాస్ చెల్లెళ్ల పెద్ద మనసు.. అత్యధిక విరాళమిచ్చింది రాజుగారి ఫ్యామిలీనే..