Bigg Boss 5 : నన్ను రెచ్చగొట్టకు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి డైలాగులు అంకితం

నిన్న వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగింది. ఒక పక్క సెలబ్రిటీలతో, మరో పక్క డ్యాన్సులతో, మరో పక్క గేమ్స్ తో సరదాగా సాగిపోయింది బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఓ సరదా గేమ్

Bigg Boss 5 : నన్ను రెచ్చగొట్టకు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి డైలాగులు అంకితం

Bb56

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో నిన్న వీకెండ్ ఎపిసోడ్ సరదాగా సాగింది. ఒక పక్క సెలబ్రిటీలతో, మరో పక్క డ్యాన్సులతో, మరో పక్క గేమ్స్ తో సరదాగా సాగిపోయింది బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఓ సరదా గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన కొన్ని డైలాగ్ కార్డ్స్ ని కంటెస్టెంట్స్ కి ఇచ్చి వాటిని ఒక్కొక్కరు ఒక డైలాగ్ తీసుకొని హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరికి అంకితమివ్వాలని చెప్పాడు నాగార్జున.

Bigg Boss 5 : యాని మాస్టర్ వెళ్ళిపోతూ ఎవరెవరి గురించి ఏం చెప్పింది??

టేబుల్ పైన ఉన్న డైలాగ్ కార్డ్స్ ని ఒక్కొక్కరిగా తీసుకొని కంటెస్టెంట్స్ కి అంకితమిచ్చారు.

ముందుగా ‘నన్ను రెచ్చగొట్టకు’ అన్న డైలాగ్‌ను మానస్‌ సన్నీకి ఇచ్చాడు. దీంతో నాగార్జున నన్ను రెచ్చగోక్కు అంటూ ఫన్నీగా సన్నీతో అన్నాడు.
షణ్ను ‘నమ్మకం లేదు దొర’ డైలాగ్‌ను రవికి ఇచ్చాడు.
రవి ‘సరె సర్లే చాలా చూశాం’ అన్న డైలాగ్ కార్డుని షణ్నుకిచ్చాడు.
యానీ ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో.. కమల్‌ హాసన్‌’ అన్న డైలాగ్‌ కార్డుని రవికి అంకితమిచ్చింది. మధ్యలో కాజల్ దూరి ఇదే డైలాగ్ ని చెప్పింది.
‘ఓన్లీ వన్స్‌ ఫసక్‌’ బోర్డును ప్రియాంక మానస్‌కు ఇచ్చింది.
శ్రీరామ్‌ ‘ఏమో సర్‌, నాకు కనబడదు’ డైలాగ్‌ షణ్నుకు సరిగ్గా సరిపోతుందన్నాడు.
‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సరిపోద్ది అని చెప్పింది సిరి.
‘నీ బొందరా నీ బొంద’ డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది కాజల్‌.
‘అయిపాయే’ డైలాగ్ రవికి సెట్టవుతుందన్నాడు సన్నీ.

Kaikala Satyanarayana : తెలుగు వాళ్లకి ‘కేజీఎఫ్‌’ని పరిచయం చేసిన కైకాల

ఈ డైలాగ్ గేమ్ ఫన్నీ గానే సాగింది. కంటెస్టెంట్స్ అంతా ఈ గేమ్ ని కామెడీ గానే తీసుకొని డైలాగ్స్ ని ఒకరికొకరు అంకితమిచ్చుకున్నారు.