Sundeep Kishan : నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. నేను ఏమేమి చేయలేను అన్నారో అవన్నీ ఈ సినిమాలో చేసి చూపించా..
మైఖేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాని, నేను ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. కానీ నాని నా సినిమాకి గెస్ట్ గా రావడం ఇదే మొదటిసారి. చాలా సార్లు సందీప్ కెరీర్ అయిపోయింది అని..............

Sundeep Kishan : సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ జంటగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో వస్తున్న సినిమా మైఖేల్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించింది. 1990 బ్యాక్ డ్రాప్ లో లవ్, డాన్ కల్చర్, యాక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మైఖేల్ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా హీరో నాని అతిథిగా హాజరయ్యారు.
Siddarth Anand : షారుఖ్ సినిమా ఫ్లాప్ అయితే అది డైరెక్టర్ తప్పే.. పఠాన్ డైరెక్టర్ కామెంట్స్..
సందీప్ కిషన్ గత సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు సందీప్. మైఖేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాని, నేను ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. కానీ నాని నా సినిమాకి గెస్ట్ గా రావడం ఇదే మొదటిసారి. చాలా సార్లు సందీప్ కెరీర్ అయిపోయింది అని అన్నారు. ఇంకా సందీప్ కి సినిమాలు వస్తాయా అన్నారు. అలా అన్న ప్రతి సారి నానిని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఈ సినిమా కోసం నేను చేయాల్సిందంతా చేశా. నేను ఏమేం చేయలేనన్నారో అవన్నీ ఈ సినిమాలో చేసి చూపించా. నా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టెన్షన్ పడ్డాను. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. 2019 లో ఈ మైఖేల్ టైటిల్ రిజిస్టర్ చేయించాను. అప్పట్నుంచి ఈ సినిమా నాకోసం కష్టపడ్డాను అని తెలిపారు.