Michael : మైఖేల్.. సందీప్ కిషన్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్.. 3 రోజుల కలెక్షన్స్ ఇవే..

మైఖేల్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కన్నడ, హిందీ భాషలతో పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ చూసి ఇదేదో రా అండ్ రస్టిక్ లాంటి సినిమా, కొత్త స్టోరీ అనుకున్నారు. కానీ సినిమా.............

Michael : మైఖేల్.. సందీప్ కిషన్ కెరీర్ బెస్ట్  కలెక్షన్స్.. 3 రోజుల కలెక్షన్స్ ఇవే..

Sundeep Kishan Michael movie collections

Michael :  సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా మైఖేల్. రంజిత్ జైకొడి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. మైఖేల్ సినిమాలో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ.. ఇలా చాలా మంది స్టార్ క్యాస్ట్ నటించారు. భారీగా ఈ సినిమాని తెరకెక్కించారు. సందీప్ గత సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

మైఖేల్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కన్నడ, హిందీ భాషలతో పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ చూసి ఇదేదో రా అండ్ రస్టిక్ లాంటి సినిమా, కొత్త స్టోరీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజయ్యాక చూస్తే పంజా మూవీ స్టోరీకి KGF ఎలివేషన్స్ ఇచ్చి రిలీజ్ చేశారని అంతా భావించారు. సినిమా టేకింగ్ బాగానే ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా అందరికి తెలిసిన కథ కావడం, KGF సినిమాలాగా నేరేషన్ చేయడంతో ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్.. పెద్ద హిట్ కొడుతున్న మరో చిన్న సినిమా..

అయితే ఈ సినిమాకి భారీగానే ఖర్చుపెట్టారు. చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నా వాళ్ళని చాలా తక్కువ టైం మాత్రమే వాడారు. మైఖేల్ సినిమాకి దాదాపు 10 కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. మైఖేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 10 కోట్లు జరిగింది. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 11 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మైఖేల్ సినిమా మొదటి రోజు దాదాపు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సందీప్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. ఇక మైఖేల్ సినిమా 3 రోజుల్లో 9.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 5 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే ఇంకా 6 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సందీప్ మరి ఈ కలెక్షన్స్ కూడా సాధించి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.