Michael : రిలీజయిన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ మైఖేల్..

ఇటీవల సూపర్ హిట్ సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది యావరేజ్, ఫ్లాప్ సినిమాలు అయితే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మైఖేల్ సినిమా కూడా చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు....................

Michael : రిలీజయిన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న సందీప్ కిషన్ మైఖేల్..

Sundeep Kishan Michael movie will stream in Aha from february 24th

Michael :  సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా రంజిత్ జైకొడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మైఖేల్. మైఖేల్ సినిమాలో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ.. ఇలా చాలా మంది స్టార్ క్యాస్ట్ తో భారీగా ఈ సినిమాని తెరకెక్కించారు. మైఖేల్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయింది. కన్నడ, హిందీ భాషలతో పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ అయింది.

ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ చూసి ఇదేదో రా అండ్ రస్టిక్ లాంటి సినిమా, కొత్త స్టోరీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజయ్యాక చూస్తే పంజా మూవీ స్టోరీకి KGF ఎలివేషన్స్ ఇచ్చి రిలీజ్ చేశారని అంతా భావించారు. సినిమా టేకింగ్ బాగానే ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా అందరికి తెలిసిన కథ కావడం, KGF సినిమాలాగా నెరేషన్ చేయడంతో ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపించి సందీప్ కిషన్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చింది.

CCL 2023 : కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. అఖిల్ అక్కినేని స్కోర్ ఎంతో తెలుసా?

మొదటి వీకెండ్ బాగా ఆడిన ఆ తర్వాత వేరే సినిమాలు రావడంతో రెండో వారానికి చాలా థియేటర్స్ నుంచి కనుమరుగైపోయింది. ఇటీవల సూపర్ హిట్ సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది యావరేజ్, ఫ్లాప్ సినిమాలు అయితే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మైఖేల్ సినిమా కూడా చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు మైఖేల్ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఆహా టీం ప్రకటించింది. సినిమా రిలీజయిన 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుండటం గమనార్హం.