Michael Trailer : సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన బాలయ్య.. మాములుగా లేదు!

టాలీవుడ్ యువ హీరో ‘సందీప్ కిషన్’ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ట్రైలర్ ని నేడు నందమూరి నటసింహ బాలకృష్ణ రిలీజ్ చేశాడు.

Michael Trailer : సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన బాలయ్య.. మాములుగా లేదు!

Michael Trailer

Michael Trailer : టాలీవుడ్ యువ హీరో ‘సందీప్ కిషన్’ తన కొత్త సినిమా ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశాడు. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ పరిశ్రమలో కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. మాస్ హీరో కట్ అవుట్ ఉన్నా సందీప్ కి ఇప్పటి వరకు అటువంటి ఒక సినిమా పడలేదు. తాజాగా అలాంటి ఒక మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు. ‘మైఖేల్’ అనే ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

Michael : సిక్స్ ప్యాక్ సూపర్ యాక్షన్‌తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్న సుందీప్ కిషన్.. మైఖేల్ టీజర్ రిలీజ్

కాగా ఈ సినిమా ట్రైలర్ ని నేడు నందమూరి నటసింహ బాలకృష్ణ రిలీజ్ చేశాడు. ఈ సినిమా కథ మొత్తం 90 కాలంలో జరగనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ నటించింది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిప్పేశారు. ట్రైలర్ లో స్టోరీ మొత్తాన్ని గౌతమ్ మీనన్ నేరేట్ చేస్తూ వచ్చాడు. వేరు వేరు గ్యాంగ్ లు మధ్య జరిగే గ్యాంగ్ వార్స్ కి ప్రేమ కథని జోడించి దర్శకుడు ఒక గ్రిపింగ్ స్టోరీని రెడీ చేసుకున్నాడు. ‘ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడమని కొంతమంది పురుషులకు తలరాతలు రాసి పెడతాడు దేవుడు’ అనే డైలాగ్ సినిమా కథని తెలియజేస్తుంది. ఏదేమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

తమిళంలో హరీష్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్పేడే రాజావుమ్ ఇదయ రాణివుమ్’ సినిమాతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు పాటల బాగున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్నా, ఇది పక్కా తెలుగు సినిమా అంటూ చెబుతున్న సందీప్ కిషన్ పాన్ ఇండియా హిట్ అందుకోగలడా? లేదా? అనేది చూడాలి.