Michael Movie: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న మైఖేల్..!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కిస్తుండగా, పూర్తి రా-రస్టిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.

Michael Movie: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జయకోడి తెరకెక్కిస్తుండగా, పూర్తి రా-రస్టిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు.
Michael Trailer : సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన బాలయ్య.. మాములుగా లేదు!
ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకునేందుకు సందీప్ కిషన్ తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ పార్ట్‌నర్ ఆహా సొంతం చేసుకున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. ఈమేరకు సినిమా టైటిల్ క్రెడిట్స్‌లో ఆహా పేరును చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియగానే ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మైఖేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా.. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.