Sundeep Kishan: మైఖేల్ లుక్‌లో అదరగొట్టిన సందీప్ కిషన్!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో....

Sundeep Kishan: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న సినిమాలు వైవిధ్యమైన కథాంశాలతో వస్తుండటంతో ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ కిషన్ చేస్తున్న మూవీ ‘మైఖేల్’. తొలిసారి కెరీర్‌లో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జెయకోడి తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది.
Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్
అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫెరోషియస్ లుక్‌లో సందీప్ కిషన్ ఈ పోస్టర్‌లో మనకు కనిపించాడు. ఈ సినిమాలో పలువురు స్టార్ యాక్టర్స్ పనిచేస్తుండటంతో మైఖేల్ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి, డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ మీనన్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ దివ్యాంశ కౌషిక్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Sundeep Kishan : కరోనా కష్టకాలంలో సందీప్ కిషన్ పెద్దమనసు.. అలాంటి పిల్లల దత్తత
అంతేగాక ఈ సినిమాలో వర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేష్‌లు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడిచింది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి మైఖేల్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సందీప్ కిషన్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటాడో చూడాలి.
- Web Series : ఓటీటీలోనూ సత్తా చాటుతాం..
- Sundeep Kishan : కరోనా కష్టకాలంలో సందీప్ కిషన్ పెద్దమనసు.. అలాంటి పిల్లల దత్తత
- Gully Rowdy : బాబు రావాలి.. రౌడీ కావాలి.. ‘రౌడీ స్టార్’ రిలీజ్ చేసిన ‘గల్లీ రౌడీ’ టీజర్..
- ఐ యామ్ యువర్ ‘అమిగో’ అంటున్న సందీప్ కిషన్..
- ‘స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలం అయ్యింది’.. ఎమోషనల్‌గా ‘ఏ 1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్..
1Priyanak jawalkar : మిర్చి కంటే ఘాటుగా ఎరుపు డ్రెస్‌లో మత్తెక్కించే చూపులతో ప్రియాంక జవాల్కర్
2Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
3Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
4Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
5Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
6Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
7Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
8Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
9Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
10Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు