Suniel Shetty : బాలీవుడ్ హీరోలు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు.. కథలు చూడట్లేదు.. | Suniel Shetty Comments on Bollywood Heros and stories

Suniel Shetty : బాలీవుడ్ హీరోలు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు.. కథలు చూడట్లేదు..

సునీల్ శెట్టి మాట్లాడుతూ.. '' ఒక సినిమా ద్వారా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది మనం ఎప్పుడో మర్చిపోయాం. బాలీవుడ్‌ డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు...............

Suniel Shetty : బాలీవుడ్ హీరోలు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు.. కథలు చూడట్లేదు..

Suniel Shetty :  సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు సాధిస్తుండటంతో సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలు ఎందుకు పరాజయం పాలవుతున్నాయి అని అక్కడి నటీనటులు కొంతమంది విశ్లేషిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు అక్కడ పరిశ్రమలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతున్నారు.

Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను

తాజాగా ఒకప్పటి హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న సునీల్‌ శెట్టి బాలీవుడ్ సినిమాలు ఎందుకు ప్లాప్ అవుతున్నాయో వివరించారు ఓ ఇంటర్వ్యూలో. సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ” ఒక సినిమా ద్వారా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనేది మనం ఎప్పుడో మర్చిపోయాం. బాలీవుడ్‌ డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు తమకు నచ్చిన సినిమాలు చేసుకుంటున్నారు. ఒక సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడు నిర్ణయించుకుంటాడు. కథే హీరో అనేది బాలీవుడ్ వాళ్ళు మర్చిపోయారు. హీరోలు వస్తారు పోతారు సినిమా మాత్రమే శాశ్వతంగా ఉంటుంది” అని అన్నారు. సునీల్ శెట్టి ఇటీవల వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

×